విద్యుత్ మీటర్లు వచ్చేస్తున్నాయ్..!

కరెంట్ బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజానీకానికి విద్యుత్ శాఖ శుభవార్త ప్రకటించింది. ప్రతినెల కరెంట్ బకాయిలు వసూలు చేయడం విద్యుత్ శాఖకు సవాల్‌గా మారింది. ప్రతినెల కోటి 20 లక్షల రూపాయల మేర విద్యుత్ బకాయిలు పేరుకుపోతున్నాయంటే.. బకాయిలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం అవుతోంది. అయితే బకాయిల నుంచి ఉపశమనం పొందడానికి విద్యుత్ శాఖ అధికారులు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మీటర్లు అందుబాటులోకి రాగానే విద్యుత్ బిల్లును మొబైల్ రీచార్జ్ […]

విద్యుత్ మీటర్లు వచ్చేస్తున్నాయ్..!
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 17, 2019 | 6:55 PM

కరెంట్ బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజానీకానికి విద్యుత్ శాఖ శుభవార్త ప్రకటించింది. ప్రతినెల కరెంట్ బకాయిలు వసూలు చేయడం విద్యుత్ శాఖకు సవాల్‌గా మారింది. ప్రతినెల కోటి 20 లక్షల రూపాయల మేర విద్యుత్ బకాయిలు పేరుకుపోతున్నాయంటే.. బకాయిలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం అవుతోంది. అయితే బకాయిల నుంచి ఉపశమనం పొందడానికి విద్యుత్ శాఖ అధికారులు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మీటర్లు అందుబాటులోకి రాగానే విద్యుత్ బిల్లును మొబైల్ రీచార్జ్ లాగా ముందుగానే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 2018 సెప్టెంబర్ నుంచి ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల వాడకాన్ని ఎస్పీడీసీఎల్ సంస్థ ప్రయోగాత్మకంగా చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11 వేల 192 ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేసి వాటి పనితీరును పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. విద్యుత్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని విద్యుత్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. వీటితోపాటు విద్యుత్ చెల్లింపు కేంద్రాల్లో కూడా విద్యుత్‌ను రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా ప్రధాన నగరాల్లో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్ శాఖ ముఖ్య అధికారులు తెలిపారు. ముందుగా హైదరాబాద్​లో ఆ తర్వాత వరంగల్, హన్మకొండ తదితర ప్రాంతాల్లో కూడా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..