Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

నిండు గర్భిణీ ఆత్మహత్య..అత్తింటి వేధింపులే కారణం

అనంతపురం జిల్లా బుక్కపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో నిండు గర్భిణీ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు శ్యామల అత్తింటి వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడినట్లుగా గుర్తించినపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప్టటారు. మహిళ ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు పరిశీలించగా…

బుక్కపట్నానికి చెందిన నాగలాల్‌, సరోజల మూడవ సంతానం శ్యామల. కర్నాటక రాష్ట్రం గౌరిబిదనూరుకి చెందిన మాంసం వ్యాపారి సునీల్‌తో శ్యామలకు 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 8 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే, మొదటి సంతానం ఆడపిల్ల కావడంతో అప్పట్నుంచి శ్యామలకు అత్తింటి వేధింపులు మొదలైనట్లుగా ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండోసారి గర్భందాల్చిన శ్యామలకు స్కానింగ్‌లో పుట్టబోయేది ఆడపిల్లే అని తేలడంతో అత్తామామల వేధింపులు మరీ ఎక్కువయ్యాయని, దీంతో పుట్టింటికి చేరిన శ్యామల వైద్య పరీక్షల నిమిత్తం  ఆస్పత్రికి వెళ్తానని చెప్పి చెరువులో దూకి ప్రాణాలు తీసుకుందని తెలిపారు. తమ కూతుర్ని అబార్షన్‌ చేయించుకోవాలని బలవంతం చేయడంతో ప్రాణాలు తీసుకున్నట్లుగా వారు ఆరోపించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శ్యామల అత్తమామ, ఆడబిడ్డలను అదుపులోకి తీసుకున్న పోలీసులు..తమదైన శైలిలో విచారణ చేపట్టారు. పుట్టబోయేది ఆడపిల్ల అని చెప్పిన స్కాన్‌ సెంటర్‌పై కూడా పోలీసులు ఆరా తీశారు. చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన వైద్యులు, ఆస్పత్రిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తచెరువు సీఐ బాల సుబ్రమణ్యం పేర్కొన్నారు