Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్. 7 లక్షల 42 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో అత్యధికంగా 22, 752 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. • గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 482 మంది మృతి • దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 7,42,417 • దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 2,64,944 • “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,56,830 • “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 20,642 గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,62,679 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు ఇప్పటి వరకు దేశంలో 1,04,73,771 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు
  • జమ్ము కాశ్మీర్లో బీజేపీ నేతపై ఉగ్రవాదుల కాల్పులు. బందీపూర్లో బీజేపీ నేత వసీం బారీపై కాల్పులు. కాల్పుల్లో బారీతో పాటు ఆయన సోదరుడు ఉమర్ సుల్తాన్, తండ్రి బషీర్‌కి కూడా గాయాలు.
  • అమారావతి: పది ప్రధాన ప్రాజెక్టులకు సంభందించి 198 పనులను ప్రీక్లోజర్ కు ప్రభుత్వం మొగ్గు. ప్రజెక్టుల పూర్తివ్యయ సమాచారం ఈ నెల 22లోగా ఇవ్వండంటూ ఆదేశం. కాంట్రాక్టు సంస్ధలకు చెల్లించిన మొత్తాలు, బ్యాంకు గ్యారెంటీలు, అడ్వాన్సులు, ముందస్తు బెంచి మార్కు విలువపై 22లోగా నివేదిక ఇవ్వాలంటూ జీవో ఉత్తర్వులు వెలువరించిన జలవనరుల శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆదిత్య నాధ్ దాస్.
  • ప్ర‌ముఖ న‌టుడు, హాస్య‌న‌టుడు జ‌గ్ దీప్ క‌న్నుమూత‌. స‌య్య‌ద్ ఇష్తియాక్‌ అహ్మ‌ద్ జాఫ్రీ అలియాస్ జ‌గ్‌దీప్ క‌న్నుమూశారు. ఆయ‌న‌కు 81 ఏళ్లు. 1939 మార్చి 29న జ‌న్మించిన జ‌గ్‌దీప్‌. 400ల‌కు పైగా చిత్రాల్లో న‌టించిన జ‌గ్‌దీప్‌. షోలే, పురాణ మందిర్‌, అందాజ్ అప్నా అప్నా చిత్రాల‌తో మంచి పేరు. బాల న‌టుడిగా బి.ఆర్‌.చోప్రా అఫ్సానాతో ప‌రిచ‌యం. అబ్ దిల్లి దూర్ న‌హీ, కె.ఎ.అబ్బాస్ చిత్రం `మున్నా`, గురు ద‌త్ చిత్రం `ఆర్ పార్‌`, భిమ‌ల్ రాయ్ చిత్రం `దో బిగా జ‌మీన్‌` చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించిన జ‌గ్‌దీప్.
  • అమరావతి ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు. ఏపీ వ్యాప్తంగా ఉన్న జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీలు. 151 మంది జూనియర్ సివిల్ జడ్జి లను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు.
  • అమరావతి: ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా చికిత్స ను చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. అనుమానితులతో పాటు పాజిటివ్ వచ్చిన వారికి ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స.

ఇంత క్రూరంగానా..!! గర్భంతో ఉన్న పిల్లిని ఉరితీసి.. ఆ తర్వాత..

Pregnant cat found hanged to death in Kerala house, ఇంత క్రూరంగానా..!! గర్భంతో ఉన్న పిల్లిని ఉరితీసి.. ఆ తర్వాత..

చదువులో అగ్రస్థానం అనుకునే కేరళ.. ఇప్పుడు దారుణ ఘటనలకు కూడా అగ్రస్థానంలో నిలుస్తోంది. తిరువనంతపురంలో చోటుచేసుకున్న ఘటనను చూసి దేశవ్యాప్తంగా జంతుప్రేమికులు షాక్ తింటున్నారు. వంచియూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పిల్లిని ఉరితీశారు కొందరు దుండగులు. పాల్‌కులంగరకు సమీపంలో వినోద కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన క్లబ్ ఎదుట ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేంద్ర ప్రభుత్వాధికారి పెరట్లో ఉన్న షెడ్డును క్లబ్‌లా వాడుకుంటున్నారు కొందరు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ ఆదివారం రోజున షెడ్‌లోకి ఓ పిల్లి ప్రవేశించింది. దీంతో ఆ క్లబ్‌‌కి చెందిన కొందరు దుండగులు దాన్ని చిత్రహింసలకు గురిచేశారు. క్లబ్ సమీపంలోనే ఉన్న ఓ తాడుకు ఆ పిల్లిని వేలాడదీశారు. అనంతరం దాన్ని చిత్రవిచిత్రంగా హింసిస్తూ.. ఉరితీశారు.

అయితే పిల్లిని హింసిస్తున్న ఘటనను చూసిన స్థానికులు.. విషయాన్ని పోలీసులకు అందించారు. దీంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే ఆ దుండగులు ఆ పిల్లిని మట్టిలో పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల రాకను గమనించి అక్కడి నుంచి పారిపోయారు. అయితే పోలీసులు ఈ ఘటనపై తొలుత కేసు నమోదు చేయకపోవడంతో.. జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతువులపై ఇలాంటి క్రూరమైన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఫెడరేషన్ ఫర్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ (FIAPO) కో ఆర్డినేటర్ పార్వతి మోహన్ ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా, గతంలోనూ ఓ డాక్టర్‌ కుక్కపైకి తుపాకీ గురిపెట్టి కాల్చి చంపిన ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది.

Related Tags