Breaking News
  • సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత. సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో చికిత్స. కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న నర్సింగ్‌ యాదవ్‌.
  • తెలంగాణలో ఇవాళ కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణ లో ఇప్పటి వరకు 471కరోనా పాజిటివ్ కేసులు . ఇప్పటి వరకు మొత్తం 12 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల నుంచి 45 మందికోలుకుని..డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 412 యాక్టీవ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
  • ఈ రోజుతో మార్కస్ కు వెళ్లిన వారితో పాటు 665 టెస్టులు చేస్తే 18 మాత్రమే . 385 మంది మార్కస్ కాంటాక్ట్స్. 45 మంది డిశ్చార్జ్. మొత్తం 414 మంది ట్రీట్మెంట్స్ పొందుతున్నారు. తెలంగాణలో 1ఒక్కరు మాత్రమే వెంటిలేటర్ పై ఉన్నారు. 22 కళ్ళ అందరూ డిశ్చార్జ్ అవుతారు.
  • లాక్‌డౌన్‌తో చుక్కేసుకుంటే కానీ చక్కగా ఉండలేని మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి.. బ్లాక్‌లో వేలకు వేలు పోసి లిక్కర్‌ బాటిళ్లు కొనుక్కుంటున్నారు. అంత డబ్బు పెట్టలేని సామాన్యులు మాత్రం పిచ్చేక్కిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వైన్‌షాపులు తెరచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారు.
  • నిజామాబాద్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. తాజాగా మరో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.

‘మహిమాన్విత నూనె’ కోసం తొక్కిసలాట..20 మంది మృతి .!

Preacher Arrested After Tanzania Church Stampede Kills at Least 20, ‘మహిమాన్విత నూనె’ కోసం తొక్కిసలాట..20 మంది మృతి .!

ఓ మత బోధకుడిపై పెట్టుకున్న గుడ్డినమ్మకం కారణంగా 20 మంది ప్రాణాలు విడిచారు.. 16 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.. టాంజానియాలోని మోషి టౌన్‌లో ఎవాంజెలికల్‌ క్రిస్టియన్‌ చర్చి ఉంది.. అందులో బోనిఫేస్‌ వాంపోసా అనే ఓ మత బోధకుడు ప్రార్థన కార్యక్రమం పెట్టాడు.. పెడితే పెట్టాడు కానీ… అనవసరమైన గొప్పలు చెప్పుకున్నాడు.. తాను దైవదూతనన్నాడు..సమస్త వ్యాధులను నయం చేసే పవిత్రమైన నూనె తన దగ్గర ఉందన్నాడు.. ఇంకా చాలా చాలా చెప్పాడు.. నిజమే కాబోలనుకున్నారు జనం… మత బోధకుడు చల్లే పవిత్రమైన నూనె ఎక్కడ తమ మీద పడదోనన్న బెంగతో అందరూ ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు.. ఫలితంగా తొక్కసలాట జరిగింది.. రోగాలు నయమవ్వడం దేవుడెరుగు.. ఆ ఘటనలో 20 మంది ప్రాణాలు విడిచారు.. గాయపడిన 16 మంది నూనె జోలికి పోకుండా హాస్పిటల్‌లో చేరారు.. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మతబోధకుడు అక్కడి నుంచి బిచాణా ఎత్తేశాడు.. పారిపోయిన అతడిని పోలీసులు వెతికి పట్టుకుని జైల్లో తోశారు.. ఇక టాంజానియా అధ్యక్షుడు మగుఫులి జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.Preacher Arrested After Tanzania Church Stampede Kills at Least 20, ‘మహిమాన్విత నూనె’ కోసం తొక్కిసలాట..20 మంది మృతి .!

Related Tags