Breaking News
  • మహబూబ్‌నగర్‌లో టెండర్‌ ఓటు నమోదు. 41వ వార్డులో 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదు. ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల ఆగ్రహం. ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు. రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం.
  • ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి-అంబటి. చట్టప్రకారం వాళ్లమీద యాక్షన్‌ తీసుకుంటాం-అంబటి. లోకేష్‌, చంద్రబాబు తాబేదారులు భూములు కొన్నారు-అంబటి.
  • కడప: ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌. రూ.2,68 లక్షలు స్వాధీనం.
  • ఏపీ హైకోర్టులో ఉత్కంఠ. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్ల కీలక విచారణ. వాదోపవాదాలు తెలుసుకోవటం కోసం వచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న.. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గి.
  • ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలి. మండలిలో జరిగేది ప్రజలకు తెలియకూడదనే ప్రసారాలు నిలిపేశారు. మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడవాలి. మండలి చైర్మన్‌కు అధికార పార్టీ నేతలు నరకం చూపించారు. బిల్లును హడావుడిగా ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డికి కౌన్సిల్‌లో ఏం పని. -ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌, బచ్చులఅర్జునుడు, సత్యనారాయణరాజు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై..ప్రత్యూష తల్లి స్పందన

All 4 accused in Hyderabad veterinarian’s rape and murder case shot dead in police chase, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై..ప్రత్యూష తల్లి స్పందన

ఎట్టకేలకు ప్రజలు కోరుకుందే జరిగింది.  శంషాబాద్‌లో దిశ హత్యోదంతానికి పోలీసులు ఎండ్ కార్డు వేశారు. ఘటన జరిగినప్పటి నుంచి ఉరి, ఎన్‌కౌంటర్ డిమాండ్లు భారీగా వినిపించాయి. నిందితుల కష్టడీ విషయంలో కూడా అంతా గోప్యత నడిచింది. అనూహ్యంగా శుక్రవారం తెల్లవారుజామున కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్‌ ఆరిఫ్‌ పాషా, జొల్లు శివ, నవీన్‌, చెన్న కేశవులు ఎన్‌కౌంటర్ అయ్యారు. పోలీసులు ఈ విషయాన్ని అఫిషియల్‌గా ప్రకటించాల్సి ఉంది.  సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తోన్న సమయంలో..నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించి, పోలీసులు ఎదిరించడంతోనే..ఆత్మరక్షణ కోసం ఎన్‌కౌంటర్ చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా మృగాళ్ల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  

కాగా ఈ విషయంపై దివంగత నటి ప్రత్యూష తల్లి స్పందించారు.  17 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ.. సమాజంలో పోరాట పటిమ ఇలానే ఉంటే తన కూతురు బ్రతికి ఉండేదని ఎమోషన్ అయ్యారు. నిర్భయ చట్టం లోకి..ప్రత్యూష కేసుని కూడా బదలయించాలి ఆమె పోలీసులను కోరారు. చట్టాలను ఇంకా మార్చాల్సిన అవసరం వచ్చింది.. దిశ పేరుతోనే ఒక చట్టం తీసుకొస్తే , స్త్రీలకు మరింత రక్షణ ఉంటుదన్నారు.  పోలీసులు దేశం దృష్టిని ఈ ఏన్‌కౌంటర్ తో తెలంగాణ వైపు తిప్పుకున్నారని, వారికి అభినందనలు తెలిపారు. తన కూతురికి కూడా త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.