హిందీ ‘ప్రస్థానం’ టీజర్ ఎప్పుడంటే.?

Prasthanam Hindi Remake Teaser Gets A Launch Date, హిందీ ‘ప్రస్థానం’ టీజర్ ఎప్పుడంటే.?

దర్శకుడు దేవ కట్టా తెరకెక్కించిన ‘ప్రస్థానం’ సినిమా హిందీలో అదే టైటిల్‌తో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్.. ఈ రీమేక్‌ను నిర్మిస్తూ.. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజా సమాచారం ఈ సినిమా టీజర్‌ను సంజయ్ దత్ పుట్టినరోజు కానుకగా జూలై 29న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. మనీషా కొయిరాల, జాకీ ష్రాఫ్, చుంకి పాండే, అలీ ఫజల్, అమైరా దస్తూర్, సత్యజిత్ దూబే ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *