Breaking News
  • భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌.భారత్‌లో నిన్న 54,736 కరోనా కేసులు నమోదు, 853 మంది మృతి దేశవ్యాప్తంగా 17,50,724కు చేరిన పాజిటివ్‌ కేసులు.భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 37,364 మంది మృతి.5,67,730 యాక్టివ్‌ కేసులు, ఇప్పటి వరకు 11,45,630 మంది డిశ్చార్జ్.
  • రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్ర శేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలలో సమర్దవంతమైన, కచ్చితమైన సేవలు అందించడానికి e-ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ తెలిపారు. సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సెక్రటేరియట్ లోని 8 శాఖలలో, HoD లలో 2 శాఖలలో e-ఆఫీసును ప్రారంభించారు.
  • హైదరాబాద్ లో పెరిగిన ఫోర్ వీలర్లఅమ్మాకాలు . మేనెలతో పోల్చితే రెండు నుంచి మూడింతలు పెరిగిన సేల్స్. సేల్స్ పెరగడంతో రిజిస్ట్రేషన్లు పెరిగాయంటున్న హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు . మే నెలలో 326 ఫోర్ వీలర్ల రిజిస్ట్రేషన్లు. జూన్ లో 848 , జూలై లో 1149 రిజిస్ట్రేషన్లు . ఆర్ టి ఎ హైదరాబాద్ జాయింట్ కమిషనర్ పాండు రంగా నాయక్.
  • హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్. హైదరాబాద్ పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ ల మేళా ను సాలార్ జుంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసము. పాతబస్తీ లో సత్ప్రవ్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ పై పోలీస్ రికార్డుల్లో నుంచి రౌడీ షీట్ తొలగించము. వీరంతా కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం కలిపించం. గతంలో వీరంతా తప్పులు చేసి, నేరాలు చేసి జైల్ వెళ్లిన వారు. కానీ ఇప్పుడు ఒక సదవకాశం వీరు అందరికీ ఆదర్శంగా ఉండి కుటుంబం తో సంతోషంగా జీవించాలని సాధారణ పౌరులుగా వుండాలని కోరుతున్న.
  • విజయవాడ: కోవిడ్‌ ఆస్పత్రి సిబ్బంది చేతివాటం. రోగుల మొబైల్స్, డబ్బులు మాయం. సెల్‌ చోరీ చేస్తున్న దృశ్యాలు. సీసీ కెమెరాల్లో రికార్డు. ఒక రోగి అదృశ్యంపై అధికారులు సీసీ కెమెరాలు పరిశీలన. ఓ ఉద్యోగి రోగి సెల్‌ఫోన్‌ తస్కరించడం చూసి అధికారులు షాక్. ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు. ఉద్యోగి పై ఎవరు అనే కోణంలో దర్యాప్తు. సిబ్బంది ప్రవర్తనపై అధికారులు ఆరా.
  • అమరావతి: 3 రాజధానుల బిల్లు ఆమోదంపై హైకోర్టులో మరో పిల్. హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేసిన రాజధాని రైతులు శ్రీనివాసరావు, సాంబశివరావు. అధికార వికేంద్రీకరణ బిల్లుల ఆమోదం సవాలు చేస్తూ ఒక పిటిషన్. సీఆర్డీఏ రద్దు సవాలు చేస్తూ రెండో పిటిషన్. జేఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ, బోస్టన్ స్. కన్సల్టెన్సీ నివేదికలు, కమిటీలను సవాలు చేస్తూ మూడో పిటిషన్ దాఖలు. రేపు విచారణకు వచ్చే అవకాశాలు. ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన రాజధాని పరిరక్షణ సమితి.

నితీశ్‌కు బై బై.. కేజ్రీతో సై సై.. వాహ్ ప్రశాంత్ !

prashanth kishore once again in news, నితీశ్‌కు బై బై.. కేజ్రీతో సై సై.. వాహ్ ప్రశాంత్ !

మోదీకి రాజకీయ సలహాదారునిగా వెలుగులోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్‌కు గత అయిదేళ్ళ కాలంలో భలే డిమాండ్ పెరిగింది. తాజాగా ఆయన కోసం ఓ వైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలు ముమ్మరం చేయగా.. మరోవైపు ప్రశాంత్ కిశోర్ తన సొంత పార్టీలో విభేదాలతో వార్తలకెక్కుతున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయన్న చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోంది.

ప్రశాంత్ కిశోర్.. ఈ పేరు 2014 కంటే ముందు చాలా తక్కువ మందికి తెలుసు. ఆనాటి ఎన్నికల్లో మోదీ ఎన్నికల వ్యూహానికి మెరుగులు దిద్ది.. విపరీతమైన పాజిటివ్ టాక్ సోషల్ మీడియా వేదికగా క్రియేట్ చేసి.. నరేంద్ర మోదీ ఘన విజయానికి కారణమైన ప్రశాంత్ కిశోర్ పేరు 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత మార్మోగిపోయింది. ఆ తర్వాత ఆయన సలహాలు, సూచనల కోసం దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలు క్యూ కట్టాయి. అయితే ఆయన బీహార్‌లో అధికారంలో వున్న జెడియు పార్టీ నేత అని చాలా తక్కువ మందికి తెలుసు. నితీష్ కుమార్ సాన్నిహిత్యంతో ఆయన జెడియు పార్టీలో చిరకాలంగా కొనసాగుతూ.. వృత్తిరీత్యా పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా సేవలందిస్తూ చేతినిండా సంపాదించుకుంటున్నాడు ప్రశాంత్ కిశోర్.

అయితే ఇటీవల రెండంశాలు ప్రశాంత్ కిశోర్‌ను వార్తలకెక్కించాయి. వీటిలో పౌరసత్వ సవరణ చట్టం ఆధారంగా నితీష్ కుమార్‌తో ఏర్పడిన విభేదాలు ఒక కారణమైతే.. రెండోది ఆయన ఢిల్లీలో అధికారంలో వున్న ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యూహకర్తగా మారనున్నారన్న వార్త. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పోటీ పడుతున్నారు. గత ఆరేడు నెలలుగా ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు తాయిలాలను ప్రకటిస్తూ వస్తున్న కేజ్రీవాల్.. ఏ ఛాన్సు వదులుకోవద్దన్న వ్యూహంతో తాజాగా ప్రశాంత్ కిశోర్‌ సేవలను వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి అనుగుణంగానే ఆయన ప్రశాంత్ కిశోర్‌ను అప్రోచ్ అవడం.. ఆయన ఓకే అనడంతో వీరిద్దరి ప్రయాణం మొదలైంది.

మరోవైపు.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని నితీష్ కుమార్ సమర్థించడాన్ని ప్రశాంత్ కిశోర్ తీవ్రంగా తప్పుపట్టారు. దేశాన్ని మతం ప్రాతిపదికన విడదీసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రశాంత్ కిశోర్ ఆరోపిస్తున్నారు. ఇలాంటి చట్టానికి నితీశ్ కుమార్ మద్దతునివ్వడం తప్పని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయం.

ఒకవైపు పాత మిత్రునితో విభేదాలు.. మరోవైపు కొత్త మిత్రుడు దొరకడం.. వెరసి ప్రశాంత్ కిశోర్ ఇక ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి, ఢిల్లీ కేంద్రంగా రాజకీయం చేస్తాడన్న ప్రచారం జోరుగా మొదలైంది.

Related Tags