బ్రేకింగ్ : జేడీయూ నుంచి పీకే ఔట్..

జేడీయూ నుంచి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌ను బహిష్కరించారు.  గత కొంతకాలంగా పార్టీ అధినేత నితీశ్ కుమార్‌, పీకే మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. జేడీయూ ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది. ఇటీవలే కేంద్రం తీసుకొచ్చిన ఎన్నార్సీ, సీఏఏలకు మొదట పార్లమెంట్‌లో జేడీయూ మద్దతిచ్చింది. అయితే ఇటీవలే నితిశ్ కుమార్..ఈ చట్టాలను..ముఖ్యంగా సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రకటించారు. అయితే ఎన్నార్సీపై మాత్రం తటస్థ వైఖరితో ఉన్నారు.  కానీ ప్రశాంత్ కిశోర్ మాత్రం ఆ […]

బ్రేకింగ్ : జేడీయూ నుంచి పీకే ఔట్..
Follow us

|

Updated on: Jan 29, 2020 | 5:03 PM

జేడీయూ నుంచి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌ను బహిష్కరించారు.  గత కొంతకాలంగా పార్టీ అధినేత నితీశ్ కుమార్‌, పీకే మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. జేడీయూ ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది. ఇటీవలే కేంద్రం తీసుకొచ్చిన ఎన్నార్సీ, సీఏఏలకు మొదట పార్లమెంట్‌లో జేడీయూ మద్దతిచ్చింది. అయితే ఇటీవలే నితిశ్ కుమార్..ఈ చట్టాలను..ముఖ్యంగా సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రకటించారు. అయితే ఎన్నార్సీపై మాత్రం తటస్థ వైఖరితో ఉన్నారు.  కానీ ప్రశాంత్ కిశోర్ మాత్రం ఆ రెండు బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించారు. అప్రజాస్వామికం, మతపరమైన వివక్ష అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపైనే ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయి.   అమిత్ షా చెప్పడం వల్లే అసలు పీకేను పార్టీలో చేర్చుకున్నామని ఇటీవల నితీశ్ వ్యాఖ్యానించడంతో గొడవ తారస్థాయికి వెళ్లింది. నితీశ్ వ్యాఖ్యలకు పీకే కూడా గట్టిగానే కౌంటరిచ్చారు. ఆయన అబద్దాలు చెప్తున్నారని, ఒకవేళ షా సూచిస్తే, మీరు నో చెప్పాల్సిందని చురకలంటించారు. మంగళవారం రోెజున  ‘పార్టీలో ఉండాలనుకునేవాళ్లు ఉంటారు..పోయేవాళ్లు పోతారు’ అంటూ వ్యాఖ్యానించారు సీఎం నితీశ్. దీనికి కౌంటరిచ్చిన పీకే.. తాను బిహార్‌ వచ్చి ఆన్సర్ చెబుతానని, కొన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పుకొచ్చారు. అంతలోనే అతడిపై వేటు నితీశ్ కుమార్ వేటు వేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా తన బహిష్కరణపై స్పందించిన పీకే..వ్యంగ్యంగా నితీశ్‌కు థ్యాంక్స్ చెప్పారు. ‘మై బెస్ట్ విషెస్ టూ రిటెయిన్ ది చైర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్..గాడ్ బ్లెస్ యూ(బీహార్ సీఎం పదవిని నిలుపుకున్నందుకు మీకు నా శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక)’ అని ట్వీట్ చేశారు. అటు ప్రశాంత్ కిశోర్‌తో పాటు పవన్ వర్మ అనే నేతను కూాడా నితీశ్ బహిష్కరించారు.

ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా అందరికి సుపరిచితుడే. ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో అతని పాత్ర కూడా ఉంది. ఇక అతను బీజేబీ వైరి పక్షాలకు స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరించడం కేంద్రంతో పాటు జేడీయూకి కంటగింపుగా మారింది. ప్రస్తుతం పీకే ఢిల్లీలో ఆప్ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. తన మార్క్ స్ట్రాటజీలతో ఆ పార్టీకి పుల్ మైలేజ్ కూడా తీసుకువచ్చారు. ఆ వేడిలోనే  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ప్రశాంత్‌ కిషోర్‌లు షాహీన్‌బాగ్‌ ఘటనపై ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు.

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..