ప్రసార భారతికి స్వయం ప్రతిపత్తి ముఖ్యం… ప్రకాష్ జవదేకర్

నేషనల్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టర్ అయిన ప్రసార భారతికి అటానమీ (స్వయంప్రతిపత్తి) అన్నది ఎంతో ముఖ్యమని నూతన సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఇది పూర్తిగా సముచితమని ఆయన చెప్పారు. ప్రసార భారతి కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఇటీవల ఈ సంస్థకు చెందిన పలువురు అధికారులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జవదేకర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భావ ప్రకటనా స్వాతంత్య్రం చాలా ముఖ్యం.. ప్రభుత్వానికి సంబంధించినంతవరకు ప్రసార భారతికి […]

ప్రసార భారతికి స్వయం ప్రతిపత్తి ముఖ్యం... ప్రకాష్ జవదేకర్
Follow us

|

Updated on: Jun 05, 2019 | 1:41 PM

నేషనల్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టర్ అయిన ప్రసార భారతికి అటానమీ (స్వయంప్రతిపత్తి) అన్నది ఎంతో ముఖ్యమని నూతన సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఇది పూర్తిగా సముచితమని ఆయన చెప్పారు. ప్రసార భారతి కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఇటీవల ఈ సంస్థకు చెందిన పలువురు అధికారులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జవదేకర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భావ ప్రకటనా స్వాతంత్య్రం చాలా ముఖ్యం.. ప్రభుత్వానికి సంబంధించినంతవరకు ప్రసార భారతికి స్వయం ప్రతిపత్తి ఉండాలన్నఉద్దేశంతోనే ఓ చట్టం రూపకల్పన జరిగిందని ఆయన చెప్పారు. ఈ చట్టం ద్వారా అటానమీ దానికదే ఈ సంస్థకు సంక్రమించిందని ఆయన వివరించారు. ఎమర్జన్సీ కాలంలో భావ ప్రకటనా స్వేచ్చకి సంకెళ్లు వేశారని, దాంతో వాటిని తొలగించేందుకు ఈ చట్టం వచ్చిందని జవదేకర్ గుర్తు చేశారు. దూరదర్శన్, ఆకాశవాణి(ఆలిండియా రేడియో)లను కూడా నిర్వహిస్తున్న ప్రసార భారతి సరికొత్త విధానాలను రూపొందించాలని ఆయన సూచించారు. తన తొలి మీడియా ఇంటరాక్షన్ మీట్ లోనూ ఆయన ఇదే విధమైన సూచనలు చేశారు. పటిష్టమైన చట్టం ఉన్నంతవరకు ప్రసారభారతికి వచ్ఛే నష్టమేమీ లేదన్నారాయన.