మాస్ మహారాజ్ కు జోడీగా పవన్ కళ్యాణ్ హీరోయిన్ .. రవితేజతో రొమాన్స్ చేయనున్న ప్రణీత.? 

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా  షూటింగ్ దశలో ఉంది.'

మాస్ మహారాజ్ కు జోడీగా పవన్ కళ్యాణ్ హీరోయిన్ .. రవితేజతో రొమాన్స్ చేయనున్న ప్రణీత.? 
Follow us

|

Updated on: Nov 30, 2020 | 12:59 PM

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అందాల భామ శృతిహాసన్ మాస్ రాజాకు జోడీగా నటిస్తుంది. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో రవితేజ కనిపించనున్నాడు.ఈ సినిమా తర్వాత రవితేజ తనతో ‘వీర’ సినిమా తెరకెక్కించిన రమేష్ వర్మ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడు.

రమేష్ వర్మ ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘రాక్షసుడు’ సినిమా చేసి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం రవితేజ సినిమా కోసం నటీ నటులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడు రమేష్ వర్మ. మాస్ రాజా అభిమానులు కోరుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు దర్శకుడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రణీతను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ‘ఎం పిల్లో ఎం పిల్లాడో’సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రణీత. ఆతర్వాత అంతగా అవకాశాలను దక్కించుకోలేక పోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే గత రెండేళ్లుగా టాలీవుడ్ లో ఈ అమ్మడికి సరైన ఛాన్స్ దక్కడం లేదు. ఎట్టకేలకు ప్రణీతకు రవితేజ సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది. మరి ఈ సినిమాతోనైన టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ బిజీ అవుతుందేమో చూడాలి.