‘ టాంపరింగ్ ‘ ఆరోపణలపై ‘ దాదా ‘ ఆందోళన

ఈవీఎం ల టాంపరింగ్ జరుగుతోందంటూ విపక్షాలు చేసిన ఆరోపణలపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఓటర్ల తీర్పును ‘ తారుమారు ‘ చేయడమే అని పేర్కొన్న ఆయన.. సంస్థాగతంగా, సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని అన్నారు. ఈసీల అజమాయిషీలో ఉన్న ఈవీఎం ల సేఫ్టీ, సెక్యూరిటీ అన్నది ఈ కమిషన్ దే అని స్పష్టం చేశారు. ‘ మన ప్రజాస్వామ్య మూల సూత్రాలను సవాలు చేసే […]

' టాంపరింగ్ ' ఆరోపణలపై ' దాదా ' ఆందోళన
Follow us

| Edited By:

Updated on: May 21, 2019 | 5:31 PM

ఈవీఎం ల టాంపరింగ్ జరుగుతోందంటూ విపక్షాలు చేసిన ఆరోపణలపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఓటర్ల తీర్పును ‘ తారుమారు ‘ చేయడమే అని పేర్కొన్న ఆయన.. సంస్థాగతంగా, సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని అన్నారు. ఈసీల అజమాయిషీలో ఉన్న ఈవీఎం ల సేఫ్టీ, సెక్యూరిటీ అన్నది ఈ కమిషన్ దే అని స్పష్టం చేశారు. ‘ మన ప్రజాస్వామ్య మూల సూత్రాలను సవాలు చేసే ఊహాగానాలకు ఆస్కార మివ్వకండి..ప్రజల తీర్పు పవిత్రమైనది. ఎలాంటి అనుమానాలకూ అతీతమైనది ‘ అంటూ ఓ స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. మనదేశ సంస్థల పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని, తమ చేతుల్లోని పరికరాలు ఎలా పని చేస్తాయన్న విషయాన్ని సమర్థులైన పనిమంతులే నిర్ణయిస్తారని ప్రణబ్ అన్నారు. కాగా-యూపీ, బీహార్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈవీఎం లను ప్రైవేటు కార్లలో తరలిస్తున్నారని , టాంపర్ చేస్తున్నారంటూ ఇందుకు సంబంధించి ఈ వీడియోలే నిదర్శనమని ప్రతిపక్షాలు వీడియో క్లిప్ లను రిలీజ్ చేసిన నేపథ్యంలో ప్రణబ్ చేసిన ఈ ప్రకటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.