తడ్కా తెచ్చిన తంటా.. కోర్టు కేసులో ప్రకాష్ రాజ్

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కోర్టు కేసుల్లో చిక్కుకున్నారు. తన “ఉలవచారు బిర్యానీ” సినిమాను బాలీవుడ్‌లో “తడ్కా” పేరుతో రీమేక్ చేసి దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. మూడేళ్ల క్రితం ప్రకాష్ రాజ్.. నానాపటేకర్, తాప్సీ పన్ను, ఆలీ ఫజల్ కాంబినేషన్‌లో ఈ రీమేక్ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు. సినిమా తీస్తున్న సమయంలో ఏర్పడ్డ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ కారణంగా.. ఆయనకు ఇప్పుడు న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యాయి. ప్రోడక్షన్ […]

తడ్కా తెచ్చిన తంటా.. కోర్టు కేసులో ప్రకాష్ రాజ్
Follow us

| Edited By:

Updated on: Aug 25, 2019 | 2:11 PM

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కోర్టు కేసుల్లో చిక్కుకున్నారు. తన “ఉలవచారు బిర్యానీ” సినిమాను బాలీవుడ్‌లో “తడ్కా” పేరుతో రీమేక్ చేసి దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. మూడేళ్ల క్రితం ప్రకాష్ రాజ్.. నానాపటేకర్, తాప్సీ పన్ను, ఆలీ ఫజల్ కాంబినేషన్‌లో ఈ రీమేక్ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు. సినిమా తీస్తున్న సమయంలో ఏర్పడ్డ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ కారణంగా.. ఆయనకు ఇప్పుడు న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యాయి.

ప్రోడక్షన్ హౌస్‌లు ఎస్సెల్ విజన్, జీ గ్రూప్ కంపెనీలు ఒప్పందం ప్రకారం ప్రకాష్ రాజ్ తమకు చెల్లించాల్సిన రూ.5.88కోట్లను చెల్లించలేదని కోర్టులో కేసు వేశాయి. అయితే ముందు జాగ్రత్తగా.. కేసు వేసిన నిర్మాణ సంస్థలకు రెండు కోట్ల రూపాయల చెక్కుతో పాటు, ఆస్థి పత్రాలను అందించారు. దీంతో కోర్టు ప్రకాష్‌రాజ్‌కి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గడువు ఇచ్చింది. అయితే గడువు తేదీలోగా రూ.2 కోట్ల చెక్కు క్లియర్ కావాలని కోర్టు తెలిపింది. లేని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదవుతుందని జస్టిస్ కేఆర్. శ్రీరాం హెచ్చరించారు. ఈ కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.