నాగబాబు వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్..’నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు’ అంటూ కౌంటర్ 

గ్రేటర్ ఎన్నికలు సినీ తారల మధ్య మాటల యుద్దానికి దారితీస్తున్నాయి. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

నాగబాబు వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్..'నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు' అంటూ కౌంటర్ 
Follow us

|

Updated on: Nov 29, 2020 | 8:47 AM

గ్రేటర్ ఎన్నికలు సినీ తారల మధ్య మాటల యుద్దానికి దారితీస్తున్నాయి. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేతగా ఉండి మరో పార్టీని గెలిపించమని కోరడం పై ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు. పవన్ ను రాజకీయ ఊసరవెల్లి అంటూ కామెంట్ చేశారు.

ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ… ప్రకాష్ రాజ్ పై మండిపడ్డారు. ప్రతిపనికిమాలిన వాడు పవన్ ను విమర్శించే వాడే అంటూ నాగబాబు తన శైలిలో ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయ్యారు. ‘నువ్వు ఎంతమంది నిర్మాతల్ని డబ్బకొసం హింసించింది. ఇచ్చిన డేట్స్‌ని కాన్సల్ చేసింది అన్నీ తెలుసు. ముందు నువ్వు మారు. సుబ్రహ్మణ్యస్వామి నిన్ను తొక్కి పెట్టి నార తీసిన విషయం నాకు గుర్తుంది ” అంటూ నాగబాబు ఘాటుగా స్పందించారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలపై తాజాగా ప్రకాష్ రాజ్ స్పందించారు.”గౌరవనీయులైన నాగబాబుగారికి.. మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయ్యింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు” అంటూ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు.