ఎర్రజెండ్‌, ఎర్రజెండ్‌ ఎన్నియాలో.. అంటూ.. గణేషుని నిమజ్జనం..!

prakasam district communists sing revolutionary songs during ganapati immersion, ఎర్రజెండ్‌, ఎర్రజెండ్‌ ఎన్నియాలో.. అంటూ.. గణేషుని నిమజ్జనం..!

భక్తిభావం, విప్లవ ఉద్యమం కలగలసిన ఆ గ్రామంలో గణేష్‌ ఉత్సవాలు వెరైటీగా నిర్వహించారు. సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్‌ విగ్రహాన్ని సీపీఐ కార్యకర్తలు ఘనంగా ఊరేగించారు. ఉరేగింపులో విప్లవ గీతాలతో హోరెత్తించారు. ఎర్రజెండాలను పట్టుకుని నృత్యాలు చేశారు. ఈ నృత్యాల్లో గ్రామంలోని మహిళలు కూడా జతకట్టి ఆడిపాడారు. ఎర్ర జెండ్‌, ఎర్రజెండ్‌ ఎన్నియాలో అంటూ గ్రామ వీధుల్లో మహిళలు డ్యాన్సులు చేశారు. విప్లవ గీతాలతో గణష్‌ నిమజ్జనం చేయడం ఆ గ్రామంలోని కమ్యూనిస్టుల సంప్రదాయం. గత కొన్నేళ్ళుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పెద్ద కొత్తపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా గణపతి నిమజ్జన కార్యక్రమాల్లో దేవుని పాటలకు భక్తులు నృత్యాలు చేస్తారు. అయితే.. పెద్ద కొత్తపల్లి గ్రామంలో మాత్రం విప్లవ గీతాలతో కార్యకర్తలు నృత్యాలు చేస్తూ దేవుని ఊరేగింపులో పాల్గొంటారు. విప్లవ గీతాలతో గణపతి నిమజ్జనం.. ఇదే.. ఇక్కడి కమ్యూనిస్టుల సంప్రదాయం అంటారు గ్రామస్థులు.

మామూలుగా కమ్యూనిస్టులు దేవుళ్లను నమ్మరంటారు. అది వారి సిద్దాంతాలకు వ్యతిరేకం అంటూ మాట్లాడతారు. కానీ ఆ సిద్దాంతాలకు భిన్నంగా పెద్ద కొత్తపల్లి గ్రామంలో కమ్యూనిస్టులు మాత్రం.. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

వినాయకచవితి సందర్బంగా ఏర్పాటు చేసిన గణపతి విగ్రహనికి పూజలు చేసిన ఆ గ్రామ కమ్యూనిస్టులు.. నిమజ్జన కార్యక్రమంలో భాగంగా విప్లవ గీతాలు పాడుతూ.. గ్రామ సమీపంలోని కొత్తపట్నం సముద్రతీరానికి ఘనంగా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో వారు.. విప్లవ గీతాలు పాడుకుంటూ.. ఎర్ర జెండాలు చేతపట్టి కేరింతలు కొడుతూ డాన్సులు వేశారు. ఈ డాన్సులలో ఈ సారి మహిళా కార్యకర్తలు కూడా పాల్గొనడంతో గణేశ్ నిమజ్జనం ఇంకా సందడిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *