ప్రకాశం బ్యారేజీవద్ద పెరుగుతున్న నీటిమట్టం

Prakasam barrage water level touches high water lelease to branch canals, ప్రకాశం బ్యారేజీవద్ద  పెరుగుతున్న నీటిమట్టం

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాలనుంచి గోదావరి, కృష్ణా నదుల్లోకి నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే రెండు నదులు వరద నీటితో నిండుగా ఉన్నాయి. దీంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా నీరు వచ్చిచేరుతోంది. బ్యారేజి వద్ద ప్రస్తుత నీటిమట్టం 11.4 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం పెరగడంతో కృష్ణా డెల్టాలోని కాల్వలకు 5,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అదే విధంగా ప్రధాన కాల్వకు 3,800 క్యూసెక్కుల నీటిని వదిలారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వ నుంచి రైవస్‌ కాల్వకు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా గుంటూరు ఛానల్‌కు 200 క్యూసెక్కులు,కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వకు 1200 క్యూసెక్కులు విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *