మళ్లీ వార్తల్లోకెక్కిన ప్రభాస్ ‘పెళ్లి‘.. ఈసారి ఎవరంటే..!

టాలీవుడ్ మోస్ట్ బ్యాచులర్ డార్లింగ్ ప్రభాస్ మళ్లీ ‘పెళ్లి’వార్తలకెక్కాడు. సాహో మూవీ రిలీజ్ తరువాత ప్రభాస్ మనువాడనున్నాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రభాస్‌ కోసం అతడి కుటుంబం అమ్మాయిని ఫిక్స్ చేసిందని.. అమెరికాకు చెందిన ఒక బిజినెస్‌మన్ కుమార్తెను ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. కాగా బాహుబలి షూటింగ్‌ నుంచి ప్రభాస్ వివాహంపై చాలాసార్లు రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ సారైనా ప్రభాస్ పెళ్లి వార్త నిజమౌతుందో లేక ప్రతిసారిలాగే రూమర్‌లాగే ఉండిపోతుందో చూడాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

కాగా మరోవైపు ప్రభాస్ నటించిన సాహో ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో డార్లింగ్ సరసన శ్రద్ధా కపూర్ నటించగా.. చుకీ పాండే, అరుణ్ విజయ్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, జాకీ ష్రాప్, నీల్ నితిన్ ముఖేష్ తదితరులు నటించారు. యాక్షన్ కథాంశంతో సుమారు 300కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఆగష్టు 30న ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *