అదిగో ‘సాహో’.. ఇదిగో అనుష్క.. ప్రభాస్ పక్కా ప్లాన్

ప్రభాస్, అనుష్క.. టాలీవుడ్‌లో ఈ జోడికి మంచి డిమాండ్ ఉంది. నాలుగు విజయవంతమైన సినిమాల్లో నటించి హిట్ పెయిర్‌గా పేరొందిన ఈ జోడి.. నిజ జీవితంలో ఒక్కటైతే బావుంటుందని వారి వారి అభిమానులు ఎప్పటినుంచో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే సినీ జీవితానికి, నిజ జీవితానికి చాలా తేడా ఉంటుందని చెబుతూ వస్తోన్న ఈ ‘బాహుబలి’ పెయిర్.. తామిద్దరం మంచి స్నేహితులమేనని పలుమార్లు స్పష్టం చేశారు. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు ప్రభాస్ ‘సాహో’ అనే చిత్రంలో నటించాడు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:48 am, Sat, 10 August 19
Prabhas Special Screening for Anushka

ప్రభాస్, అనుష్క.. టాలీవుడ్‌లో ఈ జోడికి మంచి డిమాండ్ ఉంది. నాలుగు విజయవంతమైన సినిమాల్లో నటించి హిట్ పెయిర్‌గా పేరొందిన ఈ జోడి.. నిజ జీవితంలో ఒక్కటైతే బావుంటుందని వారి వారి అభిమానులు ఎప్పటినుంచో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే సినీ జీవితానికి, నిజ జీవితానికి చాలా తేడా ఉంటుందని చెబుతూ వస్తోన్న ఈ ‘బాహుబలి’ పెయిర్.. తామిద్దరం మంచి స్నేహితులమేనని పలుమార్లు స్పష్టం చేశారు.

ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు ప్రభాస్ ‘సాహో’ అనే చిత్రంలో నటించాడు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ మూవీ ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీని అనుష్క కోసం ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ప్రభాస్ సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభాస్‌, మరికొందరితో పాటు అనుష్క సాహోను ప్రత్యేకంగా వీక్షించనున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలి.

కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సాహోలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటించగా.. నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, జాకీ ష్రాప్, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, మందిరా బేడి తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది.