కలెక్షన్స్ ఫుల్ కానీ, ప్రభాస్‌కు రూపాయి రాదు…. ఎందుకో తెలుసా ?

Prabhas Didn't Received His Remuneration For Saaho Here Is Why, కలెక్షన్స్ ఫుల్ కానీ, ప్రభాస్‌కు రూపాయి రాదు…. ఎందుకో తెలుసా ?

‘బాహుబలి’ లాంటి ప్యాన్ ఇండియన్ మూవీ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో దర్శకుడు సుజీత్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 30న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. చిత్రంలో కేవలం భారీ విజువల్ ఎఫెక్ట్స్ , గ్రాఫిక్స్ కి ఇచ్చిన ప్రాధాన్యత, ఆకట్టుకునే కథ, కథనాలకు ఇవ్వలేదనే వాదన విపరీతంగా ప్రచారం అయింది. అయితే ప్రభాస్‌కు వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమాకు ప్లస్ కావడంతో వారం రోజుల్లో 50 శాతానికి పైగానే కలెక్షన్స్ వసూళ్లు చేసింది.

ఇది ఇలా ఉండగా హీరో ప్రభాస్ ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకోలేదనే విషయం తెలిసిందే. తన ఫ్రెండ్స్ బ్యానర్‌లోనే చిత్రం తెరకెక్కడంతో భారీ వసూళ్లు సాధిస్తే.. అందులో పార్టనర్‌షిప్ తీసుకోవచ్చని భావించాడు. అయితే మూవీ వసూళ్లు పరంగా నిరాశ పరిచింది. దీంతో ప్రభాస్‌కు రెమ్యునరేషన్ ఇచ్చే స్టేజి‌లో నిర్మాతలు లేరని తెలుస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మార్కెట్ నుంచి నిర్మాతలు అత్యధిక మొత్తంలో రుణాలు తీసుకున్నట్లు వినికిడి. అంతేకాకుండా దాదాపు 50 కోట్ల వరకు హీరో ప్రభాస్ బాధ్యత వహిస్తూ సంతకం చేసినట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే ‘సాహో’ ఎండింగ్ కలెక్షన్స్‌ ఆశించిన స్థాయిలో లేకపోతే.. ప్రభాస్ పలు సినిమాలు ఉచితంగా చేయాల్సి వస్తుంది. ఈ సినిమాపై రూ.78 కోట్లు వడ్డీ ఉన్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్‌కు రూపాయి రాదు పోగా.. అతను తీసుకున్న రుణానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. మరోవైపు ‘సాహో’ సినిమా పెట్టుబడులను తిరిగి చెల్లించడానికి యూవీ క్రియేషన్స్ తమ ఆస్తులను అమ్మాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం.

ఇది ఇలా ఉండగా ‘సాహో’ కలెక్షన్స్ ప్రస్తుతం డల్‌గా ఉన్నాయి. ప్రతి చోటా కూడా ప్రేక్షకులు సినిమా పట్ల తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ చిత్రం 370-380 కోట్ల వరకు ఎండింగ్ కలెక్షన్స్ వసూళ్లు చేసే ఛాన్స్‌లు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *