‘సాహో’ ట్రైలర్ డేట్ ఫిక్స్..?

, ‘సాహో’ ట్రైలర్ డేట్ ఫిక్స్..?

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. నిన్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ రిలీజైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డ్స్ సృష్టించింది. అటు టాలీవుడ్ ప్రముఖులు సైతం టీజర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక అభిమానులు అయితే ఈ టీజర్‌కు పూర్తి ఫిదా అయ్యారు. టీజరే ఇలా ఉంటే ట్రైలర్ ఇంకెలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 1న విడుదల చేయనున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *