ఆ ఖండంలోనే అది అతిపెద్ద థియేటర్‌.. అందులో సాహో..

Prabhas' Saaho will be the fourth Indian film to be screened at Le Grand Rex, ఆ ఖండంలోనే అది అతిపెద్ద థియేటర్‌.. అందులో సాహో..

యంగ్‌ రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రం సాహో. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన సాహో ట్రైలర్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ప్యారిస్‌ నగరంలోని ప్రఖ్యాత థియేటర్‌గా పేరుపొందిన “ది గ్రాండ్‌ రెక్స్‌”లో సాహో ప్రదర్శించబడుతోంది. ఈనెల 30న సాహో విడుదల కానున్న నేపథ్యంలో ఆ థియేటర్‌ గోడలపై సాహో వీడియోలతో ఇప్పటికే ప్రచారం మొదలయ్యింది. యూరోప్‌లోనే అతిపెద్ద థియేటర్‌గా పేరుపొందిన “ది గ్రాండ్‌ రెక్స్‌” 1932లో ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి ఎన్నో సినిమా ప్రదర్శనలకు ఇది వేదికైంది. ఈ థియేటర్‌లో ఒకేసారి 2800 మంది కూర్చొవచ్చు. గతంలో ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాను ఇక్కడ ప్రదర్శించారు.

 

Prabhas' Saaho will be the fourth Indian film to be screened at Le Grand Rex, ఆ ఖండంలోనే అది అతిపెద్ద థియేటర్‌.. అందులో సాహో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *