Breaking News
  • అమరావతి: సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.112 కోట్లను కొట్టేసే కుట్ర అంశంపై తుళ్లూరు‌ పిఎస్ లో కేసు నమోదు.‌ విచారణ జరపాలంటూ రెవిన్యూ అసిస్టెంట్ సెక్రటరీ మురళికృష్ణారావు పిర్యాదు.. ఫేక్ చెక్కుల వివరాలు : 1) 52,65 కోట్లు, చెక్ నెంబర్ : 694499. 2) 39,85 కోట్లు చెక్ నెం : 792896 . 3) 24,65 కోట్ల చెక్ నెంబర్ : 792839. ఈ మూడు ఫేక్ చెక్కుల వివరాలను తుళ్లూరు పోలీసులకు అందించిన రెవిన్యూ అసిస్టెంట్ కార్యదర్శి మురళికృష్ణారావు.‌ ఫేక్ చెక్ లపై విచారణ చేస్తున్నామన్న తుళ్లూరు సీఐ ధర్మేంధ్రబాబు. చెక్ ఎన్ క్యాష్ కాకపోయినా పిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి విచారణ చేస్తున్నాం : తుళ్లూరు సీఐ ధర్మేంద్రబాబు.
  • తిరుమల లో విమానం వెళ్లిన మాట వాస్తవమేనని ప్రకటించిన ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్. విమానయాన శాఖ కు చెందిన నావిగేషన్ సర్వే విమానం తిరుమల మీదుగా వెళ్ళింది. అయితే..తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానం వెళ్ళలేదు. ఆలయానికి కొద్దిగా దూరం నుంచి ప్రయాణించింది.. తిరుమల పై విమాన రాకపోకలకు ఎలాంటి ఆంక్షలు లేవు. నో ఫ్లై జోన్ గా ప్రకటించలేమని గతంలో కేంద్రం స్పష్టం చేసింది. అయినప్పటికీ అనధికారికంగా తిరుమల నో ఫ్లై జోన్ గా కొనసాగుతోంది...ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్.
  • అమరావతి ట్విటర్ లో పవన్ కళ్యాణ్. అమరావతి రైతుల పక్షాన ఏపీ హైకోర్టు లో అఫిడవేట్ దాఖలు చేయనున్న జనసేన. ఈ బాధ్యతలను జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ తమ్మి రెడ్డి శివశంకర్ కు అప్పగింత.
  • రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు నేతృత్వంలో ఉపరాష్ట్రపతి నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం. హాజరైన డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్. పార్లమెంట్ సమావేశాల కుదింపు, రాజ్యసభలో వ్యవసాయ సంబంధ బిల్లుల ఆమోదం సందర్భంగా జరిగిన ఆందోనలుపై చర్చ జరిగే అవకాశం.
  • కాంగ్రెస్ పార్టీపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన రాజ్యసభ. రైతు బిల్లులపై చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించిన విజయసాయి రెడ్డి. కాంగ్రెస్‌ను దళారుల పార్టీగా అభివర్ణించిన విజయసాయి రెడ్డి. విజయసాయి మాటలపై అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్. కొద్దిసేపు రభసకు దారితీసిన విజయసాయిరెడ్డి విమర్శలు. రికార్డులను ఆ విమర్శలను తొలగించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు నిర్ణయం.
  • ప.గో: ద్వారకాతిరుమలలో ఏపీలోని 13 జిల్లాల కాపు జేఏసీ నేతల సమావేశం. రేపు కిర్లంపూడిలో ముద్రగడను కలిసి రాష్ట్ర కాపు జేఏసీకి నాయకత్వం వహించాలని కోరనున్న కాపునేతలు. కాపు జేఏసీ ముద్రగడ నాయకత్వంలోనే ముందుకు వెలుతుంది, ఆయనే మా నాయకుడు. రాష్ట్రంలో ఎన్ని కాపు సంఘాలు ఉన్న వాటి ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్ సంకల్పం. కాపు సంక్షేమం, అభివృద్ధి కోసం ఎవరు పాటుపడినా కాపు జేఏసీ స్వాగతిస్తుంది. రాష్ట్రం గర్వపడే ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. ముద్రగడ నాయకత్వంలోనే రిజర్వేషన్ సాధ్యమవుతాయని కాపు జేఏసీ నేతల తీర్మానం.
  • నా 60 సంవత్సరాల రాజకీయ అనుభవంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఎప్పుడూ బిల్లుల ఆమోదం జరగలేదు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రభుత్వానికి పూర్తి పక్షపాతంగా వ్యవహరించారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలకు, స్టాట్యుటరీ తీర్మానాలను డిప్యూటీ చైర్మన్ నిబంధనలకు వ్యతిరేకంగా తోసిపుచ్చారు. రాజ్యాంగానికి, నిబంధనలకు వ్యతిరేకంగా అధికారపక్షం వ్యవహరించినందుకు మా నిరసన సభలోనే తెలియజేసాము. డిప్యూటీ చైర్మన్ వ్యవహారశైలిని నిరసిస్తూ అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చాము. 12 పార్టీల మద్దతుతో 50 మంది ఎంపీల సంతకాలతో డిప్యూటీ చైర్మన్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాము. డిప్యూటీ చైర్మన్ కి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసులు పెండిగులో ఉండగా ఆయన సభ అధ్యక్షుడి హోదాలో కొనసాగే అవకాశం లేదు. కే. కేశవరావు, టీఆరెస్ పార్లమెంటరీ పార్టీ నేత.

ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ‘సాహో’ సంచలనం… ప్రభాస్ రేంజ్ అదరహో!

Prabhas Saaho movie pre-release business, ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ‘సాహో’ సంచలనం… ప్రభాస్ రేంజ్ అదరహో!

తెలుగు ఇండస్ట్రీలో బడ్జెట్ లెక్కలనే కాదు.. బాక్సాఫీస్ రూపు రేఖలను మార్చేసిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మెగాస్టార్ ఒక్కడే. ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవిని దాటాలంటే కష్టమే. కానీ ఇప్పుడు ప్రభాస్ ఆ పని చేస్తున్నాడు. ఈయన నటించిన సాహో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. మరోవైపు సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆ స్థాయిలో జరక్కపోవడం గమనార్హం. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే చిరంజీవి సినిమా అంటే తెలుగులో తిరుగులేదు. ఈయన సినిమాల కోసం బయ్యర్లు ఎగబడుతుంటారు. కానీ బయటి ఇండస్ట్రీల్లో మాత్రం చిరంజీవి హీరో మాత్రమే.. స్టార్ కాదు.

అయితే… ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇండియన్ వైడ్ ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు. రెండు భాగాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు ఆ ప్రభావం సాహోపై కనిపిస్తుంది. ఈ చిత్ర బిజినెస్ ఏకంగా 340 కోట్ల వరకు జరిగిందంటే ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులో హిందీ మాత్రమే 100 కోట్లకు పైగా ఉంది. కానీ సైరా మాత్రం 40 కోట్ల స్థాయిలోనే ఆగిపోయింది. సైరా 250 కోట్ల వరకు బిజినెస్ చేయాలని చరణ్ ప్రయత్నిస్తున్నా కష్టమే అనిపిస్తుంది. కాగా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు.

Related Tags