Breaking News
  • నెల్లూరు: సైదాపురం తహశీల్దార్‌ చంద్రశేఖర్‌ సస్పెన్షన్‌. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో చంద్రశేఖర్‌తో పాటు.. వీఆర్‌వోతో, తహశీల్దార్‌ ఆఫీస్‌ ఉద్యోగిని సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌.
  • టీవీ9కు అవార్డుల పంట. ఎక్సేంజ్‌ ఫర్‌ మీడియా న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అవార్డుల్లో.. టీవీ9కు మూడు అవార్డులు. పుల్వామా దాడి కవరేజ్‌కు బెస్ట్ న్యూస్ కవరేజ్ అవార్డు అందుకున్న.. విజయవాడ బ్యూరో చీఫ్‌ హసీనా. మరో రెండు విభాగాల్లో టీవీ9కు అవార్డులు. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ కార్యక్రమానికి.. సౌత్‌ ఇండియాలోనే బెస్ట్‌ యాంకర్‌గా రజినీకాంత్‌కు అవార్డు. టీవీ9 టాస్క్‌ఫోర్స్‌ బ్లాక్‌మ్యాజిక్‌ కార్యక్రమానికి మరో అవార్డు. అద్రాస్‌పల్లిలోని 'చితిపై మరో చితి' బాణామతి కథనానికి.. బెస్ట్‌ లేట్‌ ప్రైమ్‌టైం షో అవార్డు.
  • కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన కేంద్రం. స్థానికుల ప్రయోజనాలను కాపాడుతామని హామీ. త్వరలో ప్రత్యేక హోదా స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తాం -కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌.
  • రామానాయుడు స్టూడియోలో ప్రెషర్‌ కుక్కర్‌ సినిమా చూసిన కేటీఆర్‌. ప్రెష్‌ ఎనర్జీ, మంచి మెసేజ్‌తో సినిమా ఉంది. డాలర్‌ డ్రీమ్స్‌ కోసం అందరూ అమెరికాకు పరుగులు పెడుతున్నారు. కథలోని కంటెంట్‌ను అందరికీ అర్ధమయ్యేలా సినిమా తీశారు-మంత్రి కేటీఆర్‌.
  • తూ.గో: కోటనందూరు మండలం అప్పలరాజుపేటలో విద్యుత్‌షాక్‌తో మామిడి శ్రీను అనే వ్యక్తి మృతి.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 56,837 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు.

Saaho: పెళ్లిపై ప్రభాస్ హింట్..!

Prabhas opens up about marriage, Saaho: పెళ్లిపై ప్రభాస్ హింట్..!

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ బ్యాచులర్ లిస్ట్‌లో ప్రభాస్ ఒకడు. ఈ అక్టోబర్‌కు ఆయన 40వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాడు. దీంతో పప్పన్నం ఎప్పుడు పెడతారు..? అంటూ ప్రభాస్‌ను అడిగేవారు ఎక్కువయ్యారు. అయితే మొదటి నుంచి ఈ విషయంపై కాస్త నాన్చుతూ వస్తోన్న డార్లింగ్.. తాజాగా కూడా అలాంటి సమాధానమే ఇచ్చాడు. ‘‘పెళ్లి జరగాల్సిన సమయంలో జరుగుతుంది. అది లవ్ మ్యారేజ్ కూడా కావొచ్చు’’ అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అంటే ప్రేమ వివాహం చేసుకుంటానని ప్రభాస్ హింట్ ఇచ్చాడని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన సాహో ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అతడి సరసన శ్రద్ధా కపూర్ నటించింది. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించగా.. ఇవాళ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమాన్ని టీవీ9 ప్రత్యక్షంగా ప్రసారం చేయనుంది. మరి ఈ రోజు జరిగే ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ తన పెళ్లి గురించి ఏమైనా ప్రకటన చేస్తాడేమో చూడాలి.

Related Tags