ముగ్గురు సూపర్ స్టార్లు.. ఒకే ఫ్రేమ్‌లో..

Prabhas Met Chiranjeevi and Ram Charan At Mumbai, ముగ్గురు సూపర్ స్టార్లు.. ఒకే ఫ్రేమ్‌లో..

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాణంలో.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాయలసీమకు చెందిన మొదటితరం స్వతంత్రయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. కాగా ఈ చిత్ర టీజర్‌ని నేడు విడుదల చేశారు. ఐతే ఈ చిత్ర టీజర్ విడుదల కోసం ముంబై వెళ్లిన చిరంజీవి, రామ్ చరణ్ లను ప్రభాస్ కలిశాడు. వీరు ముగ్గురూ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ఫోటో చుస్తే అల్లూరి సీతారామరాజు, సైరా నరసింహా రెడ్డి, సాహో ని ఒకే ఫ్రేమ్‌లో చేసినట్లు అనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *