టవరెక్కిన అభిమానం.. ప్రభాస్ రావాల్సిందే అంటూ డిమాండ్

Prabhas fan climbs cell tower, టవరెక్కిన అభిమానం.. ప్రభాస్ రావాల్సిందే అంటూ డిమాండ్

అభిమానం కొంతవరకు ఉంటే బావుంటుంది కానీ ముదిరి.. వెర్రిగా మారితే ఇదిగో ఇలానే ఉంటుంది. తన అభిమాన నటుడు ప్రభాస్ కోసం ఏకంగా సెల్ టవర్ ఎక్కేశాడు ఓ యువకుడు. అత్యంత ప్రమాదకరంగా సెల్ టవర్ అంచు మీద నిలబడ్డ ఆ వ్యక్తి.. ప్రభాస్ వస్తేనే టవర్ దిగుతానని, లేకపోతే దూకి చస్తానని బెదిరిస్తున్నాడు. ఈ సంఘటన జనగామాలో చోటుచేసుకుంది.

మహబూబాబాద్‌కు చెందిన గుగులోతు వెంకన్న అనే యువకుడు జనగామలోని యశ్వంత్‌పుర పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న రిలియన్స్ సెల్ టవర్‌పైకి ఎక్కాడు. ప్రభాస్ అంటే తనకు ఇష్టమని.. ఆయనను చూడాలని ఉందని అక్కడి నుంచి వెంకన్న డిమాండ్ చేశాడు. తనను చూసేందుకు కలిసేందుకు ప్రభాస్ రాకపోతే టవర్ దూకేస్తానని అతడు బెదిరించాడు. కాగా అక్కడే ఉన్న స్థానికులు యువకుడిని కిందికి దించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా ఇటీవల ప్రభాస్ నటించిన ‘సాహో’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డివైడ్ టాక్‌ను తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్లలో అదరగొట్టింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.400కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసిన సాహో.. ఇంకా థియేటర్ల వద్ద దూసుకుపోతోంది. సాహో విడుదల తరువాత మరే పెద్ద సినిమా విడుదల అవ్వకపోవడంతో కలెక్షన్లు బాగా వచ్చాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే వసూళ్లు బాగా ఉన్నప్పటికీ.. సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉండటం వల్ల సాహో నిర్మాతలకు లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *