Saaho: క్రష్‌తో ప్రభాస్ అదరహో డ్యాన్స్..!

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభాస్ అభిమానులు అందరూ.. ‘సాహో’ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. కాగా.. ‘బాహుబలి’తోనే ఇంటర్నేషన్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. ఆరడుగుల అందగాడు.. అలా.. మనముందు కనిపిస్తే.. మనసు ఆగుతుందా.. అలాగే అక్కడ లేడీ ఫ్యాన్స్‌కూడా.. ప్రభాస్.. ప్రభాస్.. అంటూ.. అరిచారు ఓ డ్యాన్స్‌ షాలో. మరోవైపు ప్రభాస్‌కి తన చిన్నప్పటి క్రష్‌ చూసిన ఆనందం.. అసలు మ్యాటర్ ఏంటి అని ఆలోచిస్తున్నారా..! చదివేయండి మరి..! ప్రభాస్ చిన్నప్పటి క్రష్‌ ఎవరో […]

Saaho: క్రష్‌తో ప్రభాస్ అదరహో డ్యాన్స్..!
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2019 | 3:20 PM

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభాస్ అభిమానులు అందరూ.. ‘సాహో’ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. కాగా.. ‘బాహుబలి’తోనే ఇంటర్నేషన్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. ఆరడుగుల అందగాడు.. అలా.. మనముందు కనిపిస్తే.. మనసు ఆగుతుందా.. అలాగే అక్కడ లేడీ ఫ్యాన్స్‌కూడా.. ప్రభాస్.. ప్రభాస్.. అంటూ.. అరిచారు ఓ డ్యాన్స్‌ షాలో. మరోవైపు ప్రభాస్‌కి తన చిన్నప్పటి క్రష్‌ చూసిన ఆనందం.. అసలు మ్యాటర్ ఏంటి అని ఆలోచిస్తున్నారా..! చదివేయండి మరి..!

ప్రభాస్ చిన్నప్పటి క్రష్‌ ఎవరో తెలుసా..? ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్. మరి ఆమెతో కలిసి డ్యాన్స్ చేసే ఛాన్స్ ప్రభాస్‌కు వస్తే.. ఎలా ఉంటుంది. ఆ చాన్స్ రానే వచ్చేసింది. రవీనా టాండన్.. హిందీ ఛానెల్లో ఓ డ్యాన్స్‌ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే.. రవీనాతో డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది ప్రభాస్‌కి. ఎల్లో కలర్ చీరలో.. రవీనా.. ట్రెండీ బ్లూ కలర్ జీన్స్‌తో ప్రభాస్ డ్యాన్స్ చేస్తుంటే.. ప్రేక్షకుల రెండు కళ్లు సరిపోలేదు. పర్‌ఫెక్ట్ జోడీగా కనిపించారు.

Prabhas Crazy Dance With Raveena Tandon on Tip Tip Barsa Pani at Nach Baliye 9

ఈ నెల 30న సాహో చిత్రం దేశ వ్యాప్తంగా విడుదల కానున్న సందర్భంగా సౌత్, నార్త్‌లో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా.. రవీనా టాండన్‌ను కలిసే ఛాన్స్‌ వచ్చింది ప్రభాస్‌కి. కాగా.. ఈ డ్యాన్స్‌ షో పాతదే అయినప్పటికీ.. ప్రభాస్ క్రష్ రవీనా టాండన్ అయ్యేసరికి ప్రస్తుతం ఇది బాగా ట్రోల్ అవుతోంది.

https://www.instagram.com/p/B1dh5Kkg1NZ/