దేవసేన, బాహుబలి లండన్ ట్రిప్.. అసలు రీజన్ ఇదే!

Prabhas Anushka Shetty, దేవసేన, బాహుబలి లండన్ ట్రిప్.. అసలు రీజన్ ఇదే!

రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ అనుష్క శెట్టిలకు టాలీవుడ్‌లో పిచ్చ క్రేజ్ ఉంది. ఇద్దరూ కూడా మంచి స్నేహితులు.. ఆపై ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌ కావడంతో సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఒకదశలో ప్రభాస్, అనుష్క పెళ్ళికి సిద్ధమైయ్యారని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ వట్టి పుకార్లే అని ఈ జోడి ఖండించింది. ఇక ఇప్పుడు ఈ జంట తాజాగా లండన్ ట్రిప్ వెళ్లనున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్ అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తెలుగువాడి ఖ్యాతి ప్రపంచమంతా తెలిసేలా చేశాడు జక్కన్న. అటు ప్రభాస్, అనుష్కకు కూడా వరల్డ్‌వైడ్‌గా ఫేమస్ అయ్యారు. టాలీవుడ్‌ చరిత్రలో భారీ సక్సెస్‌ఫుల్ మూవీగా పేరుగాంచిన ‘బాహుబలి’ చిత్రం త్వరలోనే లండన్‌లో ప్రదర్శించబోతున్నారట. ఇందుకోసం చిత్ర యూనిట్ లండన్ పయనం కాబోతున్నారని తెలుస్తోంది.

లండన్‌లోని ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘బాహుబలి 2’ సినిమాను అక్టోబర్‌లో ప్రదర్శించనున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రముఖ సినిమాలను ఈ హాల్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించడం ఆనవాయితీ. ఈ ఏడాది బాహుబలి 2 సినిమాకు ఆ ఛాన్స్ దక్కింది. ఇక ఈ ప్రదర్శనకు ప్రభాస్, అనుష్క, రాజమౌళి, దగ్గుబాటి రానా, ఎం.ఎం కీరవాణిలు వెళ్లనున్నారు. ఈ స్పెషల్ షోలకు లండన్‌లోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, క్వీన్ ఎలిజిబత్ రాణి కుటుంబ సభ్యులు హాజరవుతారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *