అడవిని దత్తత తీసుకున్న ప్రభాస్..

హైదరాబాద్‌ శివారు దుండిగల్‌ సమీపంలోని ఖాజిపల్లి అర్బన్‌ ఫారెస్టులో సినీ హీరో ప్రభాస్‌ సందడి చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌ చొరవతో 1650 ఎకరాల అటవీభూమి డార్లింగ్ దత్తత తీసుకున్నారు.

అడవిని దత్తత తీసుకున్న ప్రభాస్..
Follow us

|

Updated on: Sep 07, 2020 | 8:56 PM

హైదరాబాద్‌ శివారు దుండిగల్‌ సమీపంలోని ఖాజిపల్లి అర్బన్‌ ఫారెస్టులో సినీ హీరో ప్రభాస్‌ సందడి చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌ చొరవతో 1650 ఎకరాల అటవీభూమి డార్లింగ్ దత్తత తీసుకున్నారు. తన తండ్రి దివంగత U.V.S రాజు పేరు మీద అర్బన్ పార్కు, అటవీ ప్రాంతాన్ని అభివృద్ది చేయనున్నారు. సుమారు రెండు కోట్ల రూపాయలను ప్రభాస్ అందించారు. అవసరమైతే మరింత ఖర్చు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. (Prabhas adopts 1650 acres of forest land in Khazipally)

ఈ సందర్భంగా ఖాజిపల్లి అర్బన్‌ ఫారెస్టుకు శంకుస్థాపన చేశారు. ఎంపీ సంతోష్‌, హీరో ప్రభాస్‌ మొక్కలు నాటారు. ఇద్దరూ కలిసి అటవీప్రాంతమంతా కలియ తిరిగారు. వ్యూ పాయింట్‌ నుంచి అటవీ అందాలు తిలకరించారు. త్వరలో మరిన్ని అర్బన్‌ ఫారెస్టు బ్లాక్‌ల దత్తతకు ప్రయత్నిస్తామని ఎంపీ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఫారెస్టు అధికారులు పాల్గొన్నారు.

Also Read:

 ఏపీ: సచివాలయాల్లో సేవా రుసుములు పెంపు.!

ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..