సేఫ్టీ కిట్.. క‌రోనా నుంచి ర‌క్ష‌ణ‌.. వేడి నుంచి ఉప‌శ‌మ‌నం..

కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే నిత్యం పోరాడే కరోనా వారియర్స్‌కు పీపీఈ కిట్లు ధరించడం కార‌ణంగా వేడిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సమస్య

సేఫ్టీ కిట్.. క‌రోనా నుంచి ర‌క్ష‌ణ‌.. వేడి నుంచి ఉప‌శ‌మ‌నం..
Follow us

| Edited By:

Updated on: May 06, 2020 | 1:53 PM

PPE kit : కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే నిత్యం పోరాడే కరోనా వారియర్స్‌కు పీపీఈ కిట్లు ధరించడం కార‌ణంగా వేడిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సమస్య తొల‌గిపోనుంది. కరోనా వైరస్ నుంచి రక్షించడమే కాకుండా, వెంటిలేషన్ కారణంగా వేడిని తగ్గించే సేఫ్టీకిట్‌ను కాన్పూర్ ఐఐటి రూపొందించింది. దీని ధర మార్కెట్లో లభించే ఇతర పీపీఈ కిట్ల కన్నా త‌క్కువగానే ఉండ‌నుంది. కోవిడ్ -19 యుద్ధంలో నిమగ్నమైన వైద్యుల సమస్యల‌ను దృష్టిలో ఉంచుకుని డాక్టర్ పవన్ మల్హోత్రా ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలతో కలిసి ఈ సేఫ్టీ కిట్‌ను తయారు చేశారు.

కాగా.. డాక్టర్ మల్హోత్రా మాట్లాడుతూ పీపీఈ కిట్ ధరించిన వైద్యులు వెంటిలేషన్ లేకపోవడం వల్ల వేడిని ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐఐటీ ల్యాబ్ శాస్త్రవేత్తల సహకారంతో సేఫ్టీ కిట్ సిద్ధం చేశామ‌న్నారు. దీనిలో ఉప‌యోగించిన మెటీరియల్ వైరస్ ప్రూఫ్ క‌లిగివున్న‌ద‌ని, ఇది ప్రయోగశాలలో విజయవంతమ‌య్యింద‌ని అన్నారు. ఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ కిట్‌లో బూట్లు, మాస్కు‌లు, చేతులకు గ్లౌజులు కూడా ఉన్నాయి. ఈ కిట్‌ను వినియోగించేందుకు అనుమతి కోసం డీఆర్‌డీఓకు పంపినట్లు మల్హోత్రా తెలిపారు. ఈ సేఫ్టీ కిట్ రూ .100 కన్నా తక్కువ ధ‌ర‌కే ల‌భ్యం కానుంది.