జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!

జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 గా భూకంప తీవ్రత నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం మంగ్ళవారం రాత్రి 10.22 గంటల ప్రాంతంలో జపాన్‌లోని ఈశాన్య ఐలండ్ హొన్షులో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు జపాన్ భూకంప హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో అక్కడి జనం భయంతో గజగజ వణికిపోయారు. భూప్రకంపనాల ధాటికి ఇళ్లని ఊగిపోయాయి. ప్రాణభయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. చాలా వరకు చెట్లు నేలకూలాయి. పలుచోట్ల భూమి […]

జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2019 | 9:59 PM

జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 గా భూకంప తీవ్రత నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం మంగ్ళవారం రాత్రి 10.22 గంటల ప్రాంతంలో జపాన్‌లోని ఈశాన్య ఐలండ్ హొన్షులో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు జపాన్ భూకంప హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో అక్కడి జనం భయంతో గజగజ వణికిపోయారు. భూప్రకంపనాల ధాటికి ఇళ్లని ఊగిపోయాయి. ప్రాణభయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. చాలా వరకు చెట్లు నేలకూలాయి. పలుచోట్ల భూమి బీటలు వారింది.

యమగట, నిగట జిల్లాలకు జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీచేసింది. అలాగే, ఇషికావా జిల్లాలోని నోటో ప్రాంతానికి హెచ్చరికలు చేసింది. భూకంపం కారణంగా సంభవించిన నష్టం విలువ ప్రస్తుతానికి తెలియరాలేదు. జపాన్ సముద్రంలో ఏడు మైళ్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా బుల్లెట్ రైలు సేవలను నిలిపివేశారు. జపాన్ ప్రభుత్వం ప్రజలను వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించింది.