మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అద్దెకు మొబైల్ పవర్ బ్యాంకులు

జర్నీ చేసేటప్పుడు ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయిందని బాధపడుతున్నారా. ఇక నుంచి ఆ బాధ లేకుండా.. హైదరాబాద్ మెట్రో రైలు కొత్త ప్లాన్‌ని తీసుకొచ్చింది. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణికులను ఆకర్షించడానికి..

మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అద్దెకు మొబైల్ పవర్ బ్యాంకులు
Follow us

| Edited By:

Updated on: Feb 24, 2020 | 10:57 AM

జర్నీ చేసేటప్పుడు ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయిందని బాధపడుతున్నారా. ఇక నుంచి ఆ బాధ లేకుండా.. హైదరాబాద్ మెట్రో రైలు కొత్త ప్లాన్‌ని తీసుకొచ్చింది. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణికులను ఆకర్షించడానికి కొత్త దారులు తొక్కుతోంది. ఇటీవల ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా బైక్‌ సర్వీసులను తీసుకొచ్చింది. తాజాగా.. మెట్రో మెట్లపై కేలరీలను తెలియజేస్తూ రంగురంగుల పెయింట్‌లను వేశారు. దీంతో.. మెట్లపై నడిచేంసదుకు ఆసక్తి చూపిస్తున్నారు ప్రయాణికులు. అలాగే ఇప్పుడు మొబైల్ పవర్ బ్యాంక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్టేషన్‌లలోనే వీటిని అద్దె ప్రాతిపదికన ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం 20 స్టేషన్‌లలో వీటిని అందుబాటులో ఉంచారు అధికారులు. ప్లగ్‌ అనే సంస్థతో కలిసి మెట్రో సంస్థ పవర్ బ్యాంక్‌లను ఏర్పాటు చేస్తోంది. రూ.199 డిపాజిట్ చేసి పవర్ బ్యాంక్ వెంట తీసుకెళ్లవచ్చు. లేదా స్టేషన్‌లోనే గంటకు కనీస ఛార్జి రూ.3 ఇచ్చి అక్కడే సేవలను ఉపయోగించుకోవచ్చు.

Read More: ‘3 రాజధానులు కాకపోతే 30 పెట్టుకోండి’.. జగన్‌పై డైరెక్టర్ సన్సేషనల్ కామెంట్స్!