Breaking News
 • దేశవ్యాప్తంగా 121 మంది దర్యాప్తు అధికారులకు కేంద్ర హోంమంత్రి పతకాలు. దర్యాప్తులో ప్రతిభ చూపిన కేంద్ర దర్యాప్తు విభాగాల అధికారులకు పతకాలను ప్రకటించిన కేంద్రం. సీబీఐ హైదరాబాద్ ఎస్పీ కళ్యాణ్ కు కేంద్ర హోంమంత్రి పతకం.
 • సంజ‌య్ ద‌త్ ఆరోగ్యం గురించి స్పందించిన భార్య మాన్య‌తా ద‌త్‌: భ‌గ‌వంతుడు మ‌రోసారి ప‌రీక్షిస్తున్నాడ‌ని వెల్ల‌డి. ఓర్చుకుంటే ఈ క‌ష్ట‌కాలాన్ని దాట వ‌చ్చ‌ని ధీమా. సంజ‌య్‌దత్ క్షేమాన్ని కోరుకుంటున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. అన‌వ‌స‌ర‌మైన రూమ‌ర్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరిన మాన్య‌త‌. సంజ‌య్ ఫైట‌ర్ అని కితాబిచ్చిన మాన్య‌త‌. అంద‌రి ప్రార్థ‌న‌లు, ఆశీర్వాదాలు కావాల‌న్న మాన్య‌త‌. పాజిటివిటీని పంచాల‌ని కోరిన మాన్య‌త.
 • విజయవాడ: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ మొత్తాన్ని పెంచుతూ ap ప్రభిత్వం ఉత్తర్వులు. హౌస్ సర్జన్, పిజి డిగ్రీ, డిప్లొమా, డెంటల్, సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు పెంపు. ఎంబీబీఎస్ విద్యార్థులకు 19,589. పిజి డిగ్రీ విద్యార్థులకు 1 ఇయర్ 44,075, 2 ఇయర్ 46,524, 3 ఇయర్ 48, 973 కు పెంపు.
 • ఉత్తరాఖండ్‌కు పొంచి ఉన్న వర్షాలు, వరదల ముప్పు. భారీ వర్షసూచన జారీ చేసిన భారత వాతావరణ శాఖ. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరిక. భాగేశ్వర్, పిత్తోరాగఢ్, నైనితాల్, ఉద్ధమ్ సింగ్ నగర్, డెహ్రాడూన్, హరిద్వార్, చమోలీ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం.
 • మణికొండ మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ సమీపం లో కార్ ఆక్సిడెంట్. జబర్దస్త్ ఆర్టిస్ట్ అభి bmw కార్ మరో కారు బ్రిజా కార్ ఢీ. బ్రిజా కారును అతివేగంగా అభి ఢీ కొట్టినట్టు ఆరోపిస్తున్న బాధితుడు.
 • హైదరాబాద్ లో థీమ్ పార్కు ల నిర్మాణానికి శంకుస్థాపన . డిల్లీ , పూణె లో తరహాలో సీటీలో ఆరు చోట్ల థీమ్ పార్క్ లు . 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిహెచ్ఎంసి . మూడు నెలలో పార్క్ ల నిర్మాణం పూర్తి చేస్తాం: జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్.
 • చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా జాగర్‌గుండా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్. కోబ్రా 223, సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసుల జాయింట్ ఆపరేషన్. నలుగురు మావోయిస్టులు హతం, మారణాయుధాలు స్వాధీనం.

9 మృతదేహాలకు పోస్టుమార్టం కంప్లీట్…. ఏం తేలిందంటే…!

Migrant worker tragedy : Nine bodies recovered from well, 9 మృతదేహాలకు పోస్టుమార్టం కంప్లీట్…. ఏం తేలిందంటే…!

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన‌ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో బయపటడిన 9 మృతదేహాలకు పోస్టుమార్టం కంప్లీట్ అయ్యింది. ఈ కేసు తీరుతెన్నుల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కున్న నేప‌థ్యంలో.. పోస్టుమార్టం రిపోర్టులో ఏముందో అని తెలుసుకోవ‌డం కోసం అంద‌రూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా వాళ్లంతా ప్రాణాల‌తో ఉండగానే బావిలో పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలిన‌ట్టు స‌మాచారం. ఇక‌ వాళ్లంతట వాళ్లే కావాల‌ని బావిలోకి దూకారా? లేదంటే మత్తు, విషంలాంటిది ఇచ్చి బతికి ఉండగానే బావిలో ప‌డేశారా అన్న విష‌యాలు తేలాల్సి ఉంది.

పోస్టుమార్టానికి సంబంధించి టీవీ9తో ఎంజీఎం మార్చురీ ఫోరెన్సిక్ విభాగం హెడ్ డాక్టర్ రజామాలిక్ చెప్పిన వివ‌రాలు..

 • ఊపిరితిత్తుల్లోకి నీరుచేరడం వల్ల‌ తొమ్మిది మంది చనిపోయారు..
 • అందరూ బావిలోనే తుదిశ్వాస విడిచారు
 • వారి విశ్రాను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాము.. వారిపై ఫుడ్ పాయిజన్ జరిగిందా లేదా తేలాలంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి..
 • నలుగురు మృతుల ఒంటిపై గాయాలున్నాయి..
 • ఈ సంఘటనకు ముందు పెనుగులాట జరిగి ఉంటుందని భావిస్తున్నాం..
 • ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసరికి పదినుంచి.. పదిహేను రోజుల స‌మ‌యం పడుతుంది..

ఈ కేసులో ముఖ్యంగా ఫోన్ కాల్స్ డిటేల్స్ కీల‌కంగా భావిస్తున్నారు పోలీసులు. మక్సూద్ త‌న‌య‌ బుస్రాతో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని అనుమానిస్తోన్న‌ యాకూబ్ ఫోన్ కాల్స్‌తోపాటు.. ఇతరులతో మక్సూద్ ఏం మాట్లాడ‌నే విష‌యాల‌పై పోలీస‌లు ఫోక‌స్ పెట్టారు. మృతుల్లో ఏడుగురి సెల్ ఫోన్లు క‌నిపించ‌క‌పోవ‌డంతో.. వాటి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అదుపులో ఉన్న అనుమానితుడు యాకూబ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అతడితోపాటు బిహర్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్‌ను కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

Related Tags