లాక్ డౌన్ల ఎఫెక్ట్.. మరో 9 నెలలు.. ఇండియాలో వెల్లువెత్తనున్న జనాభా

కరోనా వైరస్ లాక్ డౌన్ల కారణంగా మరో తొమ్మిది నెలల్లో భారత జనాభా విపరీతంగా పెరగవచ్చునని ఐక్యరాజ్య సమితికి చెందిన యునిసెఫ్ అంచనా వేసింది. ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ‘కోవిడ్-19 పాండమిక్ షాడో కింద’.. దాదాపు 116 మిలియన్ల మంది బిడ్డలు పుట్టవచ్చునట.. బాలింతలు, బిడ్డలు కూడా ‘కఠిన వాస్తవాలను’ ఎదుర్కొనవచ్చునని కూడా ఈ సంస్థ పేర్కొంది. కరోనాను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ గత మార్చి 11 న […]

లాక్ డౌన్ల ఎఫెక్ట్.. మరో 9 నెలలు.. ఇండియాలో వెల్లువెత్తనున్న జనాభా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 09, 2020 | 5:40 PM

కరోనా వైరస్ లాక్ డౌన్ల కారణంగా మరో తొమ్మిది నెలల్లో భారత జనాభా విపరీతంగా పెరగవచ్చునని ఐక్యరాజ్య సమితికి చెందిన యునిసెఫ్ అంచనా వేసింది. ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ‘కోవిడ్-19 పాండమిక్ షాడో కింద’.. దాదాపు 116 మిలియన్ల మంది బిడ్డలు పుట్టవచ్చునట.. బాలింతలు, బిడ్డలు కూడా ‘కఠిన వాస్తవాలను’ ఎదుర్కొనవచ్చునని కూడా ఈ సంస్థ పేర్కొంది. కరోనాను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ గత మార్చి 11 న ఓ డిక్లరేషన్ విడుదల చేసింది. అప్పటి నుంచి మరో 9 నెలల కల్లా ఇండియాలో జనాభా గణనీయంగా పెరుగుతుందని  యునిసెఫ్ తన నివేదికలో వివరించింది. మార్చి 25 న ఇండియాలో మూడు వారాల లాక్ డౌన్ ప్రకటించారు. ఆ తరువాత మే 17 వరకు రెండు సార్లు పొడిగించారు అని ఈ రిపోర్టు గుర్తు చేసింది.

గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 141 మిలియన్ల మంది పిల్లలు పుట్టగా.. ఇందులో ఇండియాలో 27.2 శాతం ఉన్నారని యునిసెఫ్ వెల్లడించింది. కోవిడ్-19 అదుపు చర్యలు బాగానే ఉన్నా.. చైల్డ్ బర్త్ కేర్ వంటి హెల్త్ సర్వీసులను  ప్రభావితం చేస్తాయని, లక్షలాది గర్భిణులు, బాలింతలకు, పిల్లలకు రిస్క్ గా పరిణమిస్తాయని ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రియెట్టా ఫోర్ తెలిపారు. వర్ధమాన దేశాలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇండియాలోని అరిత్రైటిస్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సుశీల్ శర్మ, జెఎన్ యు కు చెందిన పురుషోత్తం కులకర్ణి, అలహాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అభిషేక్ జైస్వాల్ కూడా ఆమెతో ఏకీభవించారు.

ఇండియా తరువాత చైనా, నైజీరియా, పాకిస్తాన్, ఇండోనేసియా దేశాలు తరువాతి స్థానాలు ఆక్రమించనున్నాయి.