ప్రముఖ తెలుగు రచయిత్రి ఆత్మహత్య

Famous Telugu Author Jagadhatri Died, ప్రముఖ తెలుగు రచయిత్రి ఆత్మహత్య

ప్రముఖ తెలుగు రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యురాలు జగద్ధాత్రి  ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఇంట్లో ఉరేసుకుని మరణించినట్లు తెలుస్తోంది. భర్త రామతీర్థ మరణం తర్వాత ఆమె మానసికంగా ఒంటరితనానికి గురైనట్లు స్థానికులు చెబుతారు. రామతీర్థ కూడా సాహితీలోకానికి తన రచనల ద్వారా సుపరిచితులు. ఆమె మరణానికి కారణాలు తెలియరాలేదు.  ఆత్మహత్యకు ముందు ఆమె రెండు లేఖలు రాసినట్లు సమాచారం. ఈ రెండు లేఖలను కూడా స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కావ్య జ్యోతి పేరుతో ఆమె అనువాద కవితలతో ఓ ప్రముఖ దినపత్రికలో కాలమ్ నిర్వహించారు. మొజాయిక్ లిటరరీ అసోసియేషన్ లో చురుకైన పాత్ర పోషించారు. వక్షస్థలే అనే కథకు ఆమె ఆర్ఎస్ కృష్ణమూర్తి అవార్డును అందుకున్నారు. ఆమె మృతి పట్ల తెలుగు సాహిత్య లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా గతంలో జగద్ధాత్రి లెక్చెరర్ గా పనిచేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఆమె రచనలు చేస్తూ వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *