‘ఆర్ఆర్ఆర్’: ఎన్టీఆర్‌కు జోడిగా ఆ భామ ఫిక్స్..!

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫిక్షనల్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో చెర్రీ కోసం అలియా భట్‌ను, ఎన్టీఆర్ కోసం డైసీ ఎడ్గర్ జోన్స్‌ను ఎన్నుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన డైసీ జోన్స్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి తప్పుకుంది. దీంతో ఆ పాత్ర కోసం మరోసారి పలువురు తారలను చూసిన రాజమౌళి.. చివరగా ఓ భామను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

అమెరికాకు చెందిన నటి, సింగర్ ఎమ్మా రాబర్ట్స్‌ను ఆర్ఆర్ఆర్‌ కోసం ఎంపిక చేసినట్లు టాక్. దీనికి సంబంధించి ఆమెతో సంప్రదింపులు కూడా జరిగినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సిందే. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, తమిళ నటుడు సముద్ర ఖని మరో కీలక పాత్రలలో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించనుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా 2001లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎమ్మా రాబర్ట్స్ గ్రాండ్ చాంపియన్, స్పైమేట్, వైల్డ్ చైల్డ్, హోటల్ ఫర్ డాగ్స్, స్క్రీమ్ 4, ఐ యామ్ మైఖేల్, ఇన్ ఎ రిలేషన్ షిప్, ఫ్యారడైజ్ హిల్స్ వంటి సినిమాల్లో నటించారు. వాటితో పాటు పలు టెలివిజన్ షోలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించారు ఎమ్మా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *