Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 51 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 151767 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 83004 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 64426 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4337 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • అమరావతి: ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ. ఎమెర్జెన్సీ పనులు నిమిత్తం తమను కంపెనీలోకి అనుమతించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎల్జీ పాలిమర్స్. రోజు వారీ కార్యకలాపాల కోసం కంపెనీలోనికి వెళ్లేందుకు సుప్రీంకోర్టు 30 మందికి అనుమతి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పత్రం ఇవ్వలేదన్న కంపెనీ తరుపు న్యాయవాది.
  • ఈ రోజు ఒకరికి CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 369 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ 141 యాక్టీవ్ కేస్ లు. 226 మంది డిశ్చార్జ్. ఇద్దరు మృతి.
  • ఢిల్లీ: తబ్లిఘి జమాత్ కేసుకు సంబంధించి 294 మంది విదేశీయుల పై 15 చార్జిషీట్లను సాకేత్ కోర్టులో దాఖలు చేయనున్న ఢిల్లీ పోలీసులు.
  • ఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావనే అధ్యక్షత ప్రారంభమైన ఆర్మీ కమాండర్ల సమావేశం. ఆర్మీ ఫోర్స్ టాప్ కమాండర్లు ఈ సమావేశానికి హాజరు. లడఖ్లో చైనా దురాక్రమణతో సహా అన్ని భద్రతా సమస్యల పై చర్చ.
  • భారత్-చైనా సరిహద్దులకు రిజర్వు బలగాల మొహరింపు. రక్షణ దళాల అధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన ప్రధాని, రక్షణశాఖ మంత్రి. సరిహద్దుల్లో రోడ్లు, ఇతర నిర్మాణ పనులు ఆపొద్దని ఆదేశం. సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణంపై అభ్యంతరం చెబుతున్న చైనా. మరోవైపు చైనాలో విస్తృతంగా రోడ్లు, ఎయిర్‌బేస్ ల నిర్మాణం. నేడు కోర్ కమాండర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆర్మీ సమావేశం.

పవన్​ మూవీలో ఐట‌మ్ సాంగ్ కోసం తెలుగు హీరోయిన్..!

PSPK 27 Updates, పవన్​ మూవీలో ఐట‌మ్ సాంగ్ కోసం తెలుగు హీరోయిన్..!

పవర్​స్టార్​ పవన్‌కల్యాణ్​ హీరోగా.. సెన్సుబుల్ డైరెక్ట‌ర్ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోన్న విష‌యం తెలిసిందే. ఇందులో తెలుగమ్మాయి పూజిత పొన్నాడ ఐట‌మ్ సాంగ్ లో న‌ర్తించ‌బోతున్న‌ట్లు టాలీవుడ్ వర్గాల స‌మాచారం. ఈ చిత్రంలో పవన్‌ బందిపోటుగా కనిపించనున్నాడని వార్త‌లు గుప్పుమంటున్నాయి. ప‌వ‌న్ మూవీస్ లో స్పెస‌ల్ సాంగ్స్ కు మంచి అప్లాజ్ ఉంటుంది. అందుకే క్రిష్-పవన్ సినిమాలోనూ ఐటమ్​సాంగ్​ పెట్టి అభిమానుల‌ను అల‌రించాల‌ని మూవీ యూనిట్ ఆశ‌ప‌డుతోంది.

పూజిత పొన్నాడ‌.. నారా రోహిత్‌తో స‌ర‌స‌న‌ ‘తుంటరి’ మూవీలో న‌టించి వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘రంగస్థలం’, ‘కల్కి’ చిత్రాల్లో నటించింది. ఈ తెలుగమ్మాయి బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో ఆక‌ట్టుకుంటుంది.

Related Tags