Breaking News
  • క్వారంటైన్‌ కేంద్రాలుగా స్టార్‌ హోటళ్లు. భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 12 హోటళ్లలో.. క్వారంటైన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసిన ఒడిశా ప్రభుత్వం. ముందుజాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారంటైన్‌ గదిలో ఉండాలనుకునేవారు.. డబ్బులు చెల్లించి ప్రైవేట్‌ హోటళ్లలో ఉండొచ్చన్న ప్రభుత్వం. రోజుకు రూ.2,500 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటన.
  • కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. మానవ కణాల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకునే.. కొత్త ఔషధాన్ని సిద్ధంచేసిన ఎంఐటీ శాస్త్రవేత్తలు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా నయం చేస్తుందని ప్రకటన.
  • ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ బి.పి.కనుంగో పదవీకాలం పొడిగింపు. రేపటితో ముగియనున్న బి.పి.కనుంగో పదవీకాలం. కనుంగో పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్బీఐ ప్రకటన.
  • కోత కాదు వాయిదా. ఏపీపై కరోనా తీవ్ర ప్రభావం. ప్రజాప్రతినిధుల జీతాలు వాయిదా. సీఎం నుంచి స్థానిక సంస్థల సభ్యుల వరకు.. 100 శాతం జీతాన్ని వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల జీతాల్లో 60 శాతం వాయిదా. నాలుగో తరగతి ఉద్యోగుల జీతంలో 10 శాతం వాయిదా. మిగతా ఉద్యోగుల జీతంలో 50 శాతం వాయిదా. వాయిదా వేసిన జీతాలు మళ్లీ చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం.
  • ఏపీలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌. ప.గో జిల్లాలో 14 పాజిటివ్‌ కేసులు నమోదు. నిన్నటి వరకు ఒక్క కేసూ లేని జిల్లాలో ఒకేసారి బయటపడ్డ 14 కేసులు. బాధితులంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్టు గుర్తింపు. ఏపీలో మొత్తం 58కి చేరిన కరోనా కేసులు.

Pooja Hegde: 8 సంవత్సరాల తరువాత రీఎంట్రీ.. పూజాకు బంపరాఫర్..!

టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలు, విజయాలతో దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఈ రెండు ఇండస్ట్రీల్లో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే హీరోయిన్‌గా తన కెరీర్‌ను పూజా మొదట తమిళ్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే.
Pooja Hegde news, Pooja Hegde: 8 సంవత్సరాల తరువాత రీఎంట్రీ.. పూజాకు బంపరాఫర్..!

టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలు, విజయాలతో దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఈ రెండు ఇండస్ట్రీల్లో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే హీరోయిన్‌గా తన కెరీర్‌ను పూజా మొదట తమిళ్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. మిస్కన్ తెరకెక్కించిన ముగమూడి అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఇందులో జీవా సరసన పూజా నటించగా.. ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది. దీంతో అక్కడ ఆమెకు అవకాశాలు కూడా రాలేదు. ఇక ఈ సినిమా తరువాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న పూజా.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో ఇక్కడ కూడా ఫ్లాప్‌లు వచ్చినప్పటికీ.. ఆ తరువాత విజయాలు రావడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సంపాదించుకుంది.

ఇదంతా పక్కనపెడితే పూజాకు ఇప్పుడు కోలీవుడ్‌లో బంపరాఫర్ వచ్చినట్లు సమాచారం. విజయ్ హీరోగా సుధా కొంకర ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయట. ఇక సన్ పిక్చర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌లో ఆఫర్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న పూజా.. ఈ అవకాశం వస్తూనే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే 8 సంవత్సరాల తరువాత కోలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది పూజా. కాగా ప్రస్తుతం సుధా కొంకర, సూర్య హీరోగా సూరరై పొట్రు(తెలుగులో ఆకాశమేహద్దుగా) అనే మూవీని తెరకెక్కించింది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: ‘భాయ్’ సినిమాలో బుట్టబొమ్మ.. భలే ఛాన్స్ కొట్టేసిందిగా…

Related Tags