హోటల్ బిల్లు కట్టకుండా పారిపోయిన పూజా గాంధీ

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి పూజా గాంధీపై పోలీస్ కేసు నమోదయ్యింది. బిల్లు కట్టకుండా హోటల్‌ నుంచి పారిపోవడంతో ఆవిడపై హోటల్ యాజమాన్యం పోలీసులకు పిర్యాదు చేసింది. బెంగళూరులోని ఓ లగ్జరీ హోటల్‌లో ఆమె కొన్ని రోజులు బస చేశారు. బిల్లు దాదాపు రూ.4.5 లక్షలు అయ్యిందని తెలుసుకున్న ఆమె పూర్తిగా చెల్లించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారట. దీంతో పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు. అయితే రూ. 2లక్షలు చెల్లించానని పూజా పోలీసులతో అన్నట్లు తెలిసింది. […]

హోటల్ బిల్లు కట్టకుండా పారిపోయిన పూజా గాంధీ
Follow us

| Edited By:

Updated on: Mar 19, 2019 | 7:00 PM

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి పూజా గాంధీపై పోలీస్ కేసు నమోదయ్యింది. బిల్లు కట్టకుండా హోటల్‌ నుంచి పారిపోవడంతో ఆవిడపై హోటల్ యాజమాన్యం పోలీసులకు పిర్యాదు చేసింది. బెంగళూరులోని ఓ లగ్జరీ హోటల్‌లో ఆమె కొన్ని రోజులు బస చేశారు. బిల్లు దాదాపు రూ.4.5 లక్షలు అయ్యిందని తెలుసుకున్న ఆమె పూర్తిగా చెల్లించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారట. దీంతో పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు. అయితే రూ. 2లక్షలు చెల్లించానని పూజా పోలీసులతో అన్నట్లు తెలిసింది. మొత్తం డబ్బు చెల్లించేందుకు కాస్త సమయం ఇవ్వమని హోటల్‌ యాజమాన్యాన్ని నటి కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఆమెకు కొన్ని రోజులు గడువు ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే గత కొంతకాలంగా పూజా పైనాన్సియల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. సినిమాలలో అవకాశాలు తగ్గడంతో..మనీ ప్రాబ్లమ్స్ చుట్టుముట్టినట్టు సమాచారం. పూజా 2002లో హిందీ సినిమా ‘దుష్మ‌ని’తో నటిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత దాదాపు 30 కన్నడ చిత్రాల్లో నటించారు. ‘దండుపాళ్యం’ సినిమాతో ఆవిడ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.