పంజాబ్‌ పై ముంబై విక్టరీ

Mumbai Indians Captain Pollard, పంజాబ్‌ పై ముంబై విక్టరీ
  • పంజాబ్ పై అనూహ్య విజయం 
  • పొలార్డ్ సంచలన ఇన్నింగ్స్  
  • రాహుల్ శతకం వృధా 

ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది. బుధవారం టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్… నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (100 నాటౌట్; 64 బంతుల్లో 6×4, 6×6) సెంచరీ చేయగా, క్రిస్ గేల్ (63; 36 బంతుల్లో 3×4, 7×6) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. ఇక ముంబై బౌలర్లలో హార్దిక్ 3 వికెట్లు తీయగా, బుమ్రా, బెరెన్‌డార్ఫ్‌ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టుకు కెప్టెన్ పొలార్డ్ (83; 31 బంతుల్లో 3×4, 10×6) సంచలన ఇన్నింగ్స్‌తో విజయాన్ని అందించాడు. దీనితో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *