ఆ అధికారి సస్పెన్షన్‌పై స్టే..

ప్రధాని మోదీ హెలికాప్టర్‌ను ఒడిషాలో తనిఖీ చేసిన ఐఏఎస్‌ అధికారి మహమ్మద్‌ మొసీన్‌ సస్పెన్షన్‌ను.. కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్‌ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎస్పీజీ భద్రత ఉన్న వ్యక్తులకు తనిఖీల నుంచి మినహాయింపు ఉందని.. అయితే నిబంధలనలకు అనుగుణంగా ఆయన ప్రవర్తించలేదని ఈసీ ఆయనపై సస్పెన్షన్‌ విధించింది. ఈసీ చర్యపై విపక్షాలు భగ్గుమనడంతో ఆయన సస్పెన్షన్‌ను ట్రిబ్యూనల్‌ నిలిపివేసింది. తదుపరి విచారణను జూన్‌ 3కు వాయిదా వేసింది. కాగా ఎన్నికల విధులు నిర్వహించకుండా మొసీన్‌పై ఈసీ నిషేధం విధించింది. […]

ఆ అధికారి సస్పెన్షన్‌పై స్టే..
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2019 | 12:01 PM

ప్రధాని మోదీ హెలికాప్టర్‌ను ఒడిషాలో తనిఖీ చేసిన ఐఏఎస్‌ అధికారి మహమ్మద్‌ మొసీన్‌ సస్పెన్షన్‌ను.. కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్‌ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎస్పీజీ భద్రత ఉన్న వ్యక్తులకు తనిఖీల నుంచి మినహాయింపు ఉందని.. అయితే నిబంధలనలకు అనుగుణంగా ఆయన ప్రవర్తించలేదని ఈసీ ఆయనపై సస్పెన్షన్‌ విధించింది. ఈసీ చర్యపై విపక్షాలు భగ్గుమనడంతో ఆయన సస్పెన్షన్‌ను ట్రిబ్యూనల్‌ నిలిపివేసింది.

తదుపరి విచారణను జూన్‌ 3కు వాయిదా వేసింది. కాగా ఎన్నికల విధులు నిర్వహించకుండా మొసీన్‌పై ఈసీ నిషేధం విధించింది. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. ఎస్పీజీ భద్రత ఉన్నవారికి తనిఖీల నుంచి మినహాయింపు ఉంటుందన్న విషయాన్ని మొసీన్‌ తెలుసుకొని ఉండాల్సిందని, విధుల్లో నిర్లక్ష్యం చూపడం వల్లే ఆయనపై సస్పెన్షన్‌ విధించినట్లు ఈసీ తెలిపింది.