మీ అయిదేళ్ల పాలన గురించి తెలియదా.. : విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ నేతలపై ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు. రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే ఆద్యుడంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు వేల మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారంటూ గుర్తు చేశారు. ట్విట్టర్ ద్వారా టీడీపీ నేతలపై చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి ఆద్యుడు చంద్రబాబు గారని.. ఆయన ఐదేళ్ల రాక్షస పాలనలో వందల మంది వైసీపీ నేతలు […]

మీ అయిదేళ్ల పాలన గురించి తెలియదా.. : విజయసాయిరెడ్డి
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2019 | 3:40 PM

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ నేతలపై ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు. రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే ఆద్యుడంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు వేల మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారంటూ గుర్తు చేశారు. ట్విట్టర్ ద్వారా టీడీపీ నేతలపై చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి ఆద్యుడు చంద్రబాబు గారని.. ఆయన ఐదేళ్ల రాక్షస పాలనలో వందల మంది వైసీపీ నేతలు జైళ్ల పాలయ్యారని ఆరోపించారు. వేల మందిని గ్రామాల నుంచి తరిమేశారని.. 600 మందిని హత్య చేశారంటూ ట్వీట్ చేశారు. వృద్ధ జంబూకం శాంతి వచనాలు పలికినట్టు ఇప్పుడు వేధింపుల గురించి మాట్లాడుతున్నారంటూ పేర్కొన్నారు.

ఇక మరో ట్వీట్‌లో చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌ను కూడా ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. తండ్రీ కొడుకులిద్దరూ.. ఇంట్లో కట్టేసిన పెంపుడు కుక్కలన్నింటినీ గొలుసులు విప్పి వదిలేశారంటూ ట్వీట్ చేశారు. అవి దారిన పోయే వాళ్ళందరి వెంట పడుతున్నాయని.. ఈయన ఉస్కో అంటే మొరగటమొక్కటే వాటికి తెలుసని.. మొరిగే కుక్కలను తరిమికొట్టిన తర్వాత తమకు బడితె పూజేనని మర్చి పోయినట్టున్నారంటూ పేర్కొన్నారు.

మరిన్ని ట్వీట్లలో నారా లోకేష్‌ని ఉద్దేశిస్తూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఇసుక మాఫియా, రాజధాని ప్రాంతంలో వరద గురించి కూడా ప్రస్తావించారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!