YSRTP: ఏపీలో పార్టీ ఏర్పాటుపై YS Sharmila క్లారిటీ.. ఏమన్నారంటే..?

ఏపీలో పార్టీ ఏర్పాటు కామెంట్స్ పై ఇవాళ స్పష్టతనిచ్చారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చని అంటూనే.. పాలిటిక్స్ అంటేనే అప్‌ అండ్‌ డౌన్స్‌ అంటూ చమత్కరించారు షర్మిల.

YSRTP: ఏపీలో పార్టీ ఏర్పాటుపై YS Sharmila క్లారిటీ.. ఏమన్నారంటే..?
Ys Sharmila
Follow us

|

Updated on: Jan 07, 2022 | 8:23 PM

ఏపీలో పార్టీ ఏర్పాటుపై స్పందించారు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చని, అదే విషయం తాను చెప్పానన్నారు. ఇటీవల చేసిన కామెంట్స్‌పై తాజాగా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారామె. తాను పుట్టింది.. తన బతుకు తెలంగాణతోనే ముడిపడి ఉందన్నారు. YSRను ప్రేమించిన తెలంగాణ ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకే YSRTP పుట్టిందని స్పష్టం చేశారు షర్మిల. అలాగే తెలంగాణ ప్రజల కోసమే ఇక్కడ పార్టీ పెట్టానని, రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చని జోస్యం చెప్పారు. నిరంతరం అధికారంలో ఉంటాం అనుకోవడం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. అధికారంలో లేనివారు.. అధికారంలోకి రారనుకోకూడదన్నారు. పాలిటిక్స్ లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చని.. ఎవరికీ అధికారం శాశ్వతం కాదన్నారు. రాజకీయాలంటేనే అప్‌ అండ్‌ డౌన్స్‌ అంటూ చమత్కరించారు YSRTP అధినేత్రి షర్మిల .

బీజేపీ నేతలకు రైతుల ఆత్మహత్యలు కనపడడం లేదా? అంటూ ప్రశ్నించారు షర్మిల. రాష్ట్ర ప్రభుత్వం వరి కొనకపోతే మీరు కొంటామని చెప్పొచ్చు కదా అని నిలదీశారు. ఇష్యూ డైవర్ట్ కోసమే బీజేపీ దీక్షలు, ధర్నాలు చేస్తోందని విమర్శించారు షర్మిల. 317 జీవో పేరుతో బీజేపీ నేతలు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని చెప్పారు. వరి ధాన్యం మొత్తం కొనాల్సిందేనని షర్మిల డిమాండ్ చేశారు.

Also Read: ఏపీ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ప్రకటించిన జగన్ సర్కార్.. మరో గుడ్ న్యూస్

Andhra Pradesh: ఏపీలో స్కూళ్లకు, జానియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవే.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..?