పాపులర్ సీఎంల లిస్ట్.. నాలుగో స్థానంలో వైఎస్ జగన్..!

దేశంలోని పాపులర్ సీఎంల లిస్ట్‌లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగో స్థానంలో నిలిచారు. ప్రముఖ సీ ఓటర్ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్

పాపులర్ సీఎంల లిస్ట్.. నాలుగో స్థానంలో వైఎస్ జగన్..!

దేశంలోని పాపులర్ సీఎంల లిస్ట్‌లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగో స్థానంలో నిలిచారు. ప్రముఖ సీ ఓటర్ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఆ తరువాత రెండు, మూడు స్థానాల్లో ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేన్ భగేల్, కేరళ సీఎం పినరయి విజయన్ ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్న జగన్‌ పట్ల చాలా మంది సంతృప్తిని వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. ఇక ఈ సర్వే కోసం ప్రతి రాష్ట్రంలో 3వేల మంది అభిప్రాయాలు సేకరించిన సంస్థ.. సోషల్ మీడియాలో కామెంట్లను కూడా ప్రాతిపదికన తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే లీస్ట్ పాపులర్ సీఎంల లిస్ట్‌లో హర్యానా సీఎం మనోహర్ లాల్ కత్తర్ మొదటి స్థానంలో ఉండగా.. టీఎస్ రావత్(ఉత్తరాఖండ్ సీఎం), అమరిందర్ సింగ్(పంజాబ్ సీఎం) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ లిస్ట్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ 8వ స్థానంలో ఉన్నారు. కాగా ప్రధానిగా నరేంద్ర మోదీకి ప్రజలు అగ్రతాంబూలం ఇచ్చారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో మోదీ  తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు హ్యాట్సాఫ్ చెప్పారు. 66.2శాతం మంది మోదీ వైపు నిలిచారు.

ఇక కేంద్ర ప్రభుత్వంపై అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్(97.46), ఒడిశా(95.73), ఛత్తీస్‌గఢ్(91.42), ఆంధ్రప్రదేశ్(78.65), జార్ఖండ్(76.84), గుజరాత్(75.4), అసోం(73), నార్త్ ఈస్ట్(72.75), తెలంగాణ(68.96), కర్ణాటక(67.94) రాష్ట్రాలు ఎక్కువగా సంతృప్తిని వ్యక్తం చేశాయి. అయితే గోవా(9.62), హర్యానా(28.73), కేరళ(30.73), తమిళనాడు(31.33), జమ్ము కశ్మీర్(46.14), ఉత్తరాఖండ్(47.1), ఢిల్లీ(51.75), ఉత్తరప్రదేశ్(52.03), కేంద్రపాలిత ప్రాంతాలు(58.49), పశ్చిమ బెంగాల్(58.68) రాష్ట్రాలు తక్కువ మార్కులు వేశాయి.

Read This Story Also: విజయవాడ గ్యాంగ్‌వార్.. వెలుగులోకి కీలక విషయాలు..!