అక్కడొకరు..ఇక్కడొకరు..మరి శివరాం దారేది ?

అక్కడొకరు..ఇక్కడొకరు..మరి శివరాం దారేది ?

కోడెల వారసుడు ఎవరు? ఆయన కుమారుడు వారసత్వం కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు గుంటూరు పొలిటికల్‌ స్కీన్‌పై హాల్‌చల్‌ చేస్తున్నాయి. సత్తెనపల్లికి ఆయన ఇంచార్జ్‌గా వస్తారా? లేకా కోడెల అడ్డా నరసరావుపేట వైపు వెళాతారా? అనేది ఆసక్తికరంగా మారింది. కోడెల శివప్రసాదరావు. పల్నాటి రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర ఉన్న నేత. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో తనదైన మార్క్‌తో ఎదిగిన రాజకీయ నేత. ఆయన మృతితో పల్నాటి టీడీపీ రాజకీయాల్లో స్పేస్‌ ఏర్పడింది. అయితే ఈ ప్లేస్‌ను […]

Rajesh Sharma

|

Oct 16, 2019 | 8:14 PM

కోడెల వారసుడు ఎవరు? ఆయన కుమారుడు వారసత్వం కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు గుంటూరు పొలిటికల్‌ స్కీన్‌పై హాల్‌చల్‌ చేస్తున్నాయి. సత్తెనపల్లికి ఆయన ఇంచార్జ్‌గా వస్తారా? లేకా కోడెల అడ్డా నరసరావుపేట వైపు వెళాతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

కోడెల శివప్రసాదరావు. పల్నాటి రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర ఉన్న నేత. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో తనదైన మార్క్‌తో ఎదిగిన రాజకీయ నేత. ఆయన మృతితో పల్నాటి టీడీపీ రాజకీయాల్లో స్పేస్‌ ఏర్పడింది. అయితే ఈ ప్లేస్‌ను భర్తీ చేసేదెవరు? అనే చర్చ మొదలైంది.

పల్నాడు ఫ్యాక్షన్‌ రాజకీయాల్లో ప్రత్యర్థులను కోడెల ధీటుగా ఎదుర్కొన్నారు. కోడెలాలాగా పార్టీని నిలబెట్టే సమర్థ నాయకుడు టీడీపీలో ఎవరు ఉన్నారు? అని తెగ వెతుకుతున్నారు. అటు పార్టీ అధిష్టానం…ఇటు కార్యకర్తలు సమర్థవంతమైన నేత కోసం తెగ సెర్చ్‌ చేస్తున్నారు.

సత్తెనపల్లిలో ఇప్పటికే టీడీపీ నేతలు రెండు వర్గాలు చీలిపోయారు. పార్టీ తరపున ఏ కార్యక్రమం జరిగినా కోడెల నివాసంలో ఓవర్గం…అటు పార్టీ కార్యాలయంలో మరోవర్గం సమావేశం అవుతున్నాయి. రాయపాటి రంగారావు కొంతకాలంగా ఇక్కడ ఫోకస్‌ పెట్టారు. పార్టీపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోడెలకు వ్యతిరేకంగా వర్గాన్ని మెయిన్‌ టెయిన్‌ చేస్తున్నారు.

నరసరావుపేటలో కూడా చదలవాడ అరవిందబాబు యాక్టివ్‌ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గంలోనే ఉంటున్నారు. కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. సత్తెనపల్లిలో రంగారావు….నరసరావుపేటలో అరవిందబాబు క్రియాశీలకంగా తయారయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కోడెల వారసుడిగా శివరాం ఎంట్రీ ఇస్తారా? ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ శివరాంకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే కేడర్‌ ఎలా రియాక్ట్‌ అవుతుంది? అనే దానిపై పార్టీ అధిష్టానం తీవ్ర మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

నరసరావుపేటలో అరవిందబాబు యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన పార్టీ ఆఫీసు కూడా సొంతగా పెట్టుకున్నారు.దీంతో అక్కడ శివరాంకు చాన్స్‌ లేదని కార్యకర్తల వాయిస్‌గా విన్పిస్తోంది. మరీ సత్తెనపల్లిపై పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది, ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో కోడెల వారసుల రాజకీయ భవిష్యత్‌పై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu