ఫ్యామిలీ గైడెన్సే బుట్టా కెరీర్‌ను దెబ్బతీసిందా..!

బుట్టా రేణుక.. ఎంత వేగంగా రాజకీయాల్లోకి దూసుకొచ్చారో.. అంతే వేగంగా వెనక్కి వెళ్లి పోయారు. 2014లో కర్నూలు లోక్ సభనుంచి వైసీపీ తరపున పోటీచేసి గెలిచిన రేణుక ఆ తర్వాత టీడీపీలో చేరారు. సిట్టింగ్ ఎంపీ స్టేటస్ ఉన్నా పార్టీలో టికెట్ సాధించలేకపోయారు. దాంతో లాస్ట్ మినిట్‌లో మళ్లీ సొంత గూటికి వచ్చేశారు. ఏం లాభం అప్పుడు పార్టీ మారకుండా ఉండి ఉంటే తన పొలిటికల్ గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉండేదని కొందరు నిట్టూరుస్తున్నారు. నిజానికి తనకు […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:04 pm, Thu, 8 August 19
ఫ్యామిలీ గైడెన్సే బుట్టా కెరీర్‌ను దెబ్బతీసిందా..!

బుట్టా రేణుక.. ఎంత వేగంగా రాజకీయాల్లోకి దూసుకొచ్చారో.. అంతే వేగంగా వెనక్కి వెళ్లి పోయారు. 2014లో కర్నూలు లోక్ సభనుంచి వైసీపీ తరపున పోటీచేసి గెలిచిన రేణుక ఆ తర్వాత టీడీపీలో చేరారు. సిట్టింగ్ ఎంపీ స్టేటస్ ఉన్నా పార్టీలో టికెట్ సాధించలేకపోయారు. దాంతో లాస్ట్ మినిట్‌లో మళ్లీ సొంత గూటికి వచ్చేశారు. ఏం లాభం అప్పుడు పార్టీ మారకుండా ఉండి ఉంటే తన పొలిటికల్ గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉండేదని కొందరు నిట్టూరుస్తున్నారు. నిజానికి తనకు పార్టీ మారాలని లేదని.. తన కుటుంబ సభ్యుల ఒత్తిడివల్లే పార్టీ మారాల్సి వచ్చిందని రేణుక అనుచర వర్గం చెబుతున్న మాట. ఫ్యామిలీ గైడెన్స్ తో చేసిన పొలిటికల్ డ్రైవ్ తన కెరీర్ ని అగాధంలో పడేస్తుందని ఊహించలేని వాపోతున్నారు రేణుక. లాస్ట్ మినిట్ లో వైసీపీలోకి వచ్చినా ఎన్నికల్లో పార్టీ తరపున బాగానే ప్రచారం చేశారు. పార్టీ పవర్ లోకి వచ్చినా.. తనకు ఫలానా పదవి కావాలి అని జగన్ ను అడగలేకపోతున్నారు బుట్టా రేణుక. అయినా జగన్‌కి తానంటే అభిమానమని, ఖచ్చితంగా తనకు ఏదో ఒక పదవి ఇస్తారని రేణుక ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బుట్టా.. జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో రేణుక రాజకీయ ప్రస్థానం చర్చనీయాంశంగా మారిపోయింది.