ఆ ఇంట్లో 66 మంది ఓటర్లు…!

అలహాబాద్‌లోని బరైచా గ్రామానికి చెందిన 98 ఏళ్ల రామ్‌ నరేశ్‌ భుర్టియాది అతి పెద్ద ఉమ్మడి కుటుంబం. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మునిమనవళ్లతో మొత్తం ఇంట్లో 82 మంది ఉంటారు. కాగా.. వీరిలో 66 మంది ఓటర్లు ఉన్నారు. అలహాబాద్‌లో మే 12న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రామ్‌ నరేశ్ కుటుంబం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా తాము కలిసే ఉంటున్నామని, అందరికీ ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఓటు ఉందని కుటుంబ పెద్ద అయిన […]

ఆ ఇంట్లో 66 మంది ఓటర్లు...!
Follow us

| Edited By:

Updated on: May 11, 2019 | 6:44 PM

అలహాబాద్‌లోని బరైచా గ్రామానికి చెందిన 98 ఏళ్ల రామ్‌ నరేశ్‌ భుర్టియాది అతి పెద్ద ఉమ్మడి కుటుంబం. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మునిమనవళ్లతో మొత్తం ఇంట్లో 82 మంది ఉంటారు. కాగా.. వీరిలో 66 మంది ఓటర్లు ఉన్నారు. అలహాబాద్‌లో మే 12న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రామ్‌ నరేశ్ కుటుంబం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఎన్నో ఏళ్లుగా తాము కలిసే ఉంటున్నామని, అందరికీ ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఓటు ఉందని కుటుంబ పెద్ద అయిన రామ్‌నరేశ్‌ తెలిపారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అందరం కలిసే ఓటు వేసేందుకు వెళ్తామని, పోలింగ్‌ అధికారులు తమను ప్రత్యేకంగా ఆహ్వానిస్తారని అన్నారు. ఈసారి తన మునిమనవళ్లు 8 మంది తొలిసారిగా ఓటుహక్కు వినియోగించుకోబోతున్నట్లు తెలిపారు.