UP Cabinet Expansion: కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు.. రాబోయే ఎన్నికల నేపథ్యంలోనే మార్పులు..

యూపీ కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ సాయంత్రమే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మంత్రివర్గంలోకి..

UP Cabinet Expansion: కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు.. రాబోయే ఎన్నికల నేపథ్యంలోనే మార్పులు..
Yogi

యూపీ కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ సాయంత్రమే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మంత్రివర్గంలోకి కొత్తగా ఏడుగురు చేరుతున్నట్టు సమాచారం. ఆ ఏడుగురు మంత్రులు ఇవాళ రాజ్‌భవన్‌లో ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లుచేశారు అధికారులు. ఈ రోజు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్నవారిలో సంగీతా బింద్‌, జితిన్‌ ప్రసాద, చత్రాపాల్‌ గ్యాంగ్వార్‌, దినేష్‌ ఖటిక్‌, కృష్ణ పాశ్వాన్‌  చేస్తారని ప్రచారం జరుగుతోంది.

యోగి ప్రభుత్వంలో 53 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో 23 మంది క్యాబినెట్ మంత్రులు, తొమ్మిది మంది రాష్ట్ర మంత్రులు (స్వతంత్ర బాధ్యతలు), 21 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. ఇది మరో ఏడుగిరి చోటు లభిస్తోంది.

యూపీలో రానున్న ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం. అందుకే గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది ఆ పార్టీ. ఇప్పటికే కేంద్రమంత్రివర్గ విస్తరణలో యూపీకి అధిక ప్రాధాన్యత కల్పించింది. తాజాగా యూపీ కేబినెట్‌ విస్తరణపై దృష్టి పెట్టింది.

2022 ఆరంభంలో జరగనున్న యుపి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి తన మిత్రపక్షాలతో ఎలా వ్యవహరించాలని ఇష్టపడుతుందో కూడా ఈ విస్తరణలో కనిపిస్తోంది. అప్నా దళ్ (సోనేలాల్) , నిషాద్ పార్టీల నుండి నాయకులకు యోగి మంత్రివర్గంలో స్థానం కల్పించవచ్చని బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉన్న నాయకులకు మాత్రమే ఈ మంత్రి వర్గ వస్తరణలో చోటు దక్కుతుందని అంటున్నారు. ఇలాంటివారికి మాత్రమే రాబోయే ఎన్నికల్లో  ప్రాధాన్యత ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:  AP Government: ఇక ఏపీలో అది కుదరదంటే.. కుదరదు.. కొత్త చట్టం తీసుకొచ్చే యోచనలో సర్కార్..

Elon Musk: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు బ్రేకప్ చెప్పాడు.. 3 ఏళ్ల బంధం విడిపోవడానికి కారణం అదేనట..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu