రైతు చట్టాలపై రాజకీయ పార్టీలవి నకిలీ ఉద్యమాలు.. గణతంత్ర వేడుకల్లో బండి సంజయ్‌ విమర్శలు

భారత 72వ గణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లను పార్టీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నేతలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌..

  • K Sammaiah
  • Publish Date - 1:43 pm, Tue, 26 January 21
రైతు చట్టాలపై రాజకీయ పార్టీలవి నకిలీ ఉద్యమాలు.. గణతంత్ర వేడుకల్లో బండి సంజయ్‌ విమర్శలు

భారత 72వ గణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లను పార్టీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నేతలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ స‌ర్కారుపై, దేశంలో రైతుల ఉద్య‌మంపై నిప్పులు చెరిగారు.

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు పార్టీలు న‌కిలీ ఉద్యమాలు చేస్తున్నాయని బండి సంజ‌య్ విమర్శించారు. రాష్ట్రంలో ఒక విధంగా, కేంద్రంలో మరో విధంగా మాట్లాడుతూ ప్రజల్లో కన్ఫ్యూజన్‌ క్రియేట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. చట్టాల పట్ల అవగాహన లేకే ఇలాంటి చర్యలకు పాల్పలడుతున్నారని విమర్శించారు.

తెలంగాణలో అవినీతి పాలన కొనసాగుతోంద‌ని బండి సంజయ్‌ ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణలో అధికార పార్టీ పాలన కొనసాగిస్తోంద‌ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.