సిద్దిపేటలో జోరుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం.. ఆ పార్టీలకు ఢిల్లీలో బాస్‌లు.. టీఆర్‌ఎస్‌కు ప్రజలే బాస్‌లన్న హరీశ్‌రావు

త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం..

సిద్దిపేటలో జోరుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం.. ఆ పార్టీలకు ఢిల్లీలో బాస్‌లు.. టీఆర్‌ఎస్‌కు ప్రజలే బాస్‌లన్న హరీశ్‌రావు
Follow us

|

Updated on: Feb 13, 2021 | 6:55 PM

త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల లోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై జరిగిన జిల్లా కార్యకర్తల సమావేశానికి మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ,ఎమ్మెల్యే సతీష్ కుమార్, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ హాజరయ్యారు. ఈ మేరకు జిల్లాలో తొలి పార్టీ సభ్యత్వం నమోదు చేసుకొని , పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మెంబెర్ షిప్ లో నెంబర్ వన్ గా మన సిద్దిపేట జిల్లా నిలవాలని, అన్నింటిలో ఆదర్శంగా ఉన్న జిల్లా.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనూ ఆదర్శంగా నిలవాలన్నారు. తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు సిద్దిపేట, గులాబీ జెండా ఎగిరింది సిద్దిపేటలోనే అన్నారు. ఉద్యమంలో, అభివృద్ధిలో ముందు ఉన్నాం. సభ్యత్వ నమోదులో కూడా ముందు ఉండాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో ఎంతో మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారన్నారు. ఎన్నో పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని, మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు.

తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్ర మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలాగా వదులుకున్నామని వివరించారు. కేసీఆర్‌ ఉక్కు సంకల్పంతో ఆమరణ దీక్ష చేసి తెలంగాణా సాధించారని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌కు డిల్లీలో బాస్ లు ఉంటే, టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలే బాస్ లన్నారు.

Read more:

ఆ పంచాయతీల ఏకగ్రీవాలపై విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశం.. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో కీలక పరిణామం..