‘సాగర్‌’ సమరానికి గులాబీ దళం రెడీ.. లక్షన్నర మందితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు భారీ ఏర్పాట్లు

సాగర్‌’ సమరానికి గులాబీ దళం టీఆర్ఎస్ రెడీ అవుతోంది. త్వరలో జరుగబోయే ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ భారీ ఏర్పాట్లు చేస్తోంది. లక్షన్నర మందితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ విజయవంతం చేయాలని..

  • Sanjay Kasula
  • Publish Date - 6:08 am, Tue, 19 January 21
‘సాగర్‌’ సమరానికి గులాబీ దళం రెడీ.. లక్షన్నర మందితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు భారీ ఏర్పాట్లు

CM KCR Election Campaign : ‘సాగర్‌’ సమరానికి గులాబీ దళం టీఆర్ఎస్ రెడీ అవుతోంది. త్వరలో జరుగబోయే ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ భారీ ఏర్పాట్లు చేస్తోంది. లక్షన్నర మందితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ విజయవంతం చేయాలని ఏర్పాట్లు చేస్తోంది. నాగార్జునసాగర్‌ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసేందుకు హాలియా మండల కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.

ఈనెల 22–24 తేదీల మధ్య సభ నిర్వహించాలని ముందుగా నిర్ణయించినప్పటికీ..ఈ తేదీలపై మంగళవారం రోజు క్లారిటీ రానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే ఈ బహిరంగ సభకు సుమారు లక్షన్నర మందిని సమీకరించాలని జిల్లా టీఆర్ఎస్ పార్టీ నేతలు నిర్ణయించారు. సభ నిర్వహణ తేదీకి సంబంధించి మంత్రి జగదీశ్‌రెడ్డి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను సోమవారం కలసి చర్చించినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో మంత్రి కేటీఆర్‌ శనివారం జరిపిన భేటీలో సభ ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చించారు.