Huzurabad By Election: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో సింబల్‌ టెన్షన్.. సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్న గులాబీ శ్రేణులు..

మనుషులను పోలిన మనుషులు ఉంటేనే గుర్తించలేం. అదే ఎన్నికల్లో- గుర్తులను పోలిన గుర్తులు ఉంటే ఇక గుర్తించడం అస్సలు కష్టం.  అలాంటి సమస్యే ఇప్పుడు.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో..

Huzurabad By Election: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో సింబల్‌ టెన్షన్.. సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్న గులాబీ శ్రేణులు..
Trs
Follow us

|

Updated on: Oct 24, 2021 | 9:25 AM

మనుషులను పోలిన మనుషులు ఉంటేనే గుర్తించలేం. అదే ఎన్నికల్లో- గుర్తులను పోలిన గుర్తులు ఉంటే ఇక గుర్తించడం అస్సలు కష్టం.  అలాంటి సమస్యే ఇప్పుడు.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో సింబల్‌ టెన్షన్ పట్టుకుంది. ఎన్నిక ఏదైనా ఒకేలా ఉన్న గుర్తులతో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు గెలుపోటములపై తీవ్ర ప్రభావ చూపుతున్నాయి. ఎమ్మెల్యే ఎన్నికల నుంచి ఎంపీ ఎన్నికల వరకు తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఇప్పుడు ఉప ఎన్నికలోనూ రోడ్‌ రోలర్‌, చపాతీ మేకర్‌, హెలికాఫ్టర్‌ గుర్తులు అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. నువ్వా..నేనా అన్నట్టు సాగుతున్న ఈ బై పోల్‌ ఫైట్‌లో ఈ గుర్తులు ఎంత మేర డ్యామేజ్‌ చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు గులాబీ నాయకులు. డమ్మీ ఈవీఎంలతో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు గులాబీ శ్రేణులు.

కారు గుర్తు ఉన్న టీఆర్‌ఎస్‌కు ఎదురైన కష్టాలు- ఏ ప్రధానపార్టీ కూడా ఎదురుకాలేదు. ఎందుకంటే, చిన్నపార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించే గుర్తులు వివాదాస్పదం అయ్యాయి. కారు స్పీడుకు ఇతర గుర్తులు బ్రేకులు వేశాయి. ఫలితంగా ఎన్నికల్లో పోరాటం ఒక ఎత్తు అయితే, గుర్తులతో పోరాటం ఇంకో ఎత్తులా మారింది.

2014లో నాగర్‌కర్నూల్‌ నుంచి తాజాగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికల వరకు ఈ గుర్తులతో ఇబ్బండి పడుతోంది. గతంలో గెలిచిన చోట్ల కూడా ఇలాంటి గుర్తులు గులాబీ విజేతల మెజారిటీలను తగ్గించాయని గులాబీ దళం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆటో, ట్రక్కు, రోడ్డు రోలర్‌, రోటీ మేకర్‌ వంటి ఎన్నికల గుర్తు కారుజోరుకు కళ్లెం వేశాయి.

ఇలాంటి గుర్తుల వల్ల టీఆర్‌ఎస్‌కు పడాల్సిన ఓట్లు ఇండిపెండెంట్లకు పడుతున్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. 2018 డిసెంబర్‌నాటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీకి ట్రక్కు గుర్తు వచ్చింది. 30 సీట్లలో ఆ పార్టీ పోటీచేసింది.

భువనగరి పార్లమెంటు ఎన్నికల్లో కూడా బూరనర్సయ్యగౌడ్‌ ఇలాగే ఓడిపోయారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే గతంలో ఎదుర్కొన్న సమస్యకు కొత్త పరిస్కరంతో ముందుకు వెళ్తున్నారు. సామాన్య ఓటర్లకు అవగాహన కల్పించేందుకు డమ్మీ ఈవీఎంలతో క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ గుర్తుకు ఇతర గుర్తులకు తేడా ఏంటో వివరించి చెబతున్నారు.

ఇవి కూడా చదవండి: Viral Video: షోరూమ్ బయట రోడ్డుపై కూర్చొని టీవీ చూస్తున్న చిన్నారులు.. వైరల్ అవుతున్న భావోద్వేగ దృశ్యం..

Goa Assembly Election 2022: హీటెక్కిన గోవా పాలిటిక్స్.. బీజేపీని దెబ్బకొట్టేందుకు రాష్ట్రంలోకి మమతా బెనర్జీ ఎంట్రీ